Don't Miss!
- Sports IPL 2024: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. విధ్వంసకర బ్యాటర్ దూరం!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్‌పై కేసు నమోదు
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
షూటింగ్స్ లేకపోయినా కొరటాల ఆదాయానికి ఢోకా లేదు.. కూర్చున్న చోటే పేమెంట్స్..
ఫెయిల్యూర్స్ లేని కమర్షియల్ దర్శకుడిగా తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా కొరటాల కూడా ఎన్నో రోజుల నుంచి పని లేకుండా ఖాళీగా ఉన్నాడు. రెమ్యునరేషన్ ముందుగానే అందుకున్నప్పటికి ఇప్పుడు సమయం చాలా వృధా అవుతోంది.
ఆచార్య ఫినిష్ అయితే వేరే సినిమాను ఎనౌన్స్ చేసి తన ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆచార్య ఫినిష్ అయ్యే వరకు మరో సినిమాను ఒకే చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇకపోతే కొరటాలకు వేరే దారులలో పేమెంట్స్ గట్టిగానే అందుతున్నాయట. కూర్చున్న చోటే కేవలం తన సమాధానాలతో ఆదాయాన్ని పెంచుకుంటున్నాడట.
కొన్ని బడా ప్రొడక్షన్ తో పాటు ఇతర స్టార్ హీరోలు నిర్మాతలు సేఫ్ జోన్ లో కమర్షియల్ సినిమాలో తీయాలని అనుకుంటే.. ముందుగా కొరటాల వద్దకు వస్తున్నారట. కథ విన్న తరువాత తనకు నచ్చిన సలహాలు ఇస్తున్న కొరటాల అవసరం అయితే కాస్త స్క్రిప్ట్ లో చేంజెస్ చేసి సాలీడ్ పేమెంట్స్ అందుకుంటున్నాడట. ఈ విధంగా షూటింగ్స్ లేకపోయినా కూడా కొరటాల శివ చాలా తెలివిగా ఆదాయాన్ని పెంచుకోవడం హాట్ టాపిక్ గా మారింది.