సోషల్ మీడియాకి కొరటాల శివ గుడ్ బై.. కానీ టచ్లోనే ఉంటా అంటూ ఆసక్తికర ప్రకటన

తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కొరటాల శివ ఆసక్తికర ప్రకటన చేశారు.. తాను సోషల్ మీడియాకు దూరంగా వెళుతున్నాను అంటూ ఆయన ప్రకటించి కలకలం రేపారు.. కొద్దిసేపటి క్రితం తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఆయన ఒక నోట్ విడుదల చేశారు. ''హలో అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను సోషల్ మీడియాకు దూరంగా వెళ్లాలని భావిస్తున్నాను, ఈ సోషల్ మీడియా ద్వారా నేను అనేక విషయాలను మీ దృష్టికి తీసుకు వచ్చాను కానీ ఇప్పుడు సోషల్ మీడియా నుంచి తప్పుకోవాల్సిన సమయం వచ్చేసింది'' అంటూ ఆయన ప్రకటించారు.

koratala siva says good bye to social media

అయినా సరే నేను మీడియా మిత్రులు ద్వారా మీతో టచ్ లో ఉంటాను, ఎప్పుడూ మీతో ఇంటరాక్ట్ అవుతూనే ఉంటా, మీడియం మారుతుందేమో కానీ మన మధ్య ఉన్న బంధం మారదు అంటూ ఆయన ఆసక్తికరంగా ఒక ప్రకటన చేశారు.. అయితే ఆయన ఎందుకు సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నారు అనే విషయం మీద మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు.. చివరిగా భరత్ అనే నేను సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొరటాల శివ ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు..
koratala siva says good bye to social media

రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.. మరోపక్క ఈ సినిమా పూర్తవ్వగానే అని ఎన్టీఆర్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్నారు. ఇంకా పేరు ఖరారు కాని ఈ సినిమా అని ప్రస్తుతానికి ఎన్టీఆర్ 30వ సినిమా అని సంభోదిస్తున్నారు. కొరటాల శివ సోషల్ మీడియా వదిలి వెళ్లి పోవడానికి కారణాలు ఏమై ఉండి ఉంటాయి అనే అంశం మీద పెద్ద ఎత్తున ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయానికి ఆయన క్లారిటీ ఇస్తే గాని ఒక అంచనాకు రాలేము.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X