twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తన ఆఫీస్‌లో ఏం జరుగుతుందో చూపించిన కొరటాల శివ.. వీడియో వైరల్

    |

    Recommended Video

    Koratala Siva Implements Rain Water Harvesting In His Office || కొరటాల శివ సందేశం

    కొరటాల శివ.. ఏ సినిమా చేసినా అందులో సమాజానికి ఉపయోగపడే, మేల్కొలిపే అంశాలను జోడిస్తాడు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారెజ్, భరత్ అనే నేను లాంటి సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూనే.. సమాజానికి ఉపయోగపడే అంశాలను చెప్పడంతో అందరి మనసులను దోచుకున్నాడు.

    దేశమంతా నీటి ఎద్దడి..

    దేశమంతా నీటి ఎద్దడి..

    రోజంతా తినకపోయినా ఉండగలిగే మనిషి.. ఒక్క పూట నీటిని తాగకుండా ఉండలేడు. అలాంటి నీటిని ఒడిసిపట్టకుండా విచ్చలవిడిగా వాడుతుండటంతో నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. దేశంలో ఎన్నో నగరాలు నీటి ఎద్దడిని అనుభవిస్తున్నాయి. అందులో హైదరాబాద్ కూడా చేరేందుకు సిద్దంగా ఉంది.

     ఇంకుడు గుంత నిర్మించిన కొరటాల శివ..

    ఇంకుడు గుంత నిర్మించిన కొరటాల శివ..

    ఇంకుడు గుంతలు వాడి.. నీటి లభ్యతను పెంచుకోవచ్చని ప్రభుత్వాలు అందరికీ అవగాహన కల్పించారు. నగరంలో ఎంతో మంది ఈ ఇంకుడు గుంతలు నిర్మించి ప్రతీ నీటి బొట్టును ఒడిసిపడుతున్నారు. అయితే తన కార్యాలయంలో కూడా నీటిని అలాగే సంరక్షిస్తున్నట్లు కొరటాల శివ ఓ వీడియోను పోస్ట్ చేశాడు.

    ప్రతీ వర్షపు బొట్టును..

    నా కార్యాలయంలో పడిన ప్రతీ వర్షపు బొట్టును సేవ్ చేస్తున్నాను.. అంటూ షేర్ చేసిన వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది. సినిమాల్లో మంచి మాటలు చెప్పడమే కాదు.. నిజంగా మీరు మంచి పనులే చేస్తున్నారంటూ నెటిజన్లు కొరటాలను పొగుడుతున్నారు. కొరటాల శివ ప్రస్తుతం చిరంజీవీ 152వ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.

    English summary
    Trying to save rain water in our office in the best way possible...Every drop of rain water is stored into water harvesting pit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X