Don't Miss!
- Finance Stock Market: యూఎస్ మార్కెట్ల దారిలో ఇండియన్ మార్కెట్లు.. లాభాల్లోనే ప్రయాణం..
- News చంద్రబాబు పై చర్యలకు ఈసీకి సీఈవో సిఫార్సు..!!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Technology జియో సినిమా యాప్‌లో IPL మ్యాచ్‌లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కొరటాల శివ దృష్టిలో పడిన యువ హీరో.. పదేళ్ల కష్టానికి అసలైన గోల్డెన్ ఛాన్స్
హీరోగా సక్సెస్ కావాలి అంటే ఈ రోజుల్లో చాలా మంది యువకులు ముందుగా నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్లు ఎలాగూ జనాలకు తెలుసు. కానీ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా సక్సెస్ కావడం అంటే చాలా అదృష్టం ఉండాలి. అందుకే నెగిటివ్ , పాజిటివ్ అని తేడా లేకుండా కొంతమంది యువ నటులు సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. ఇక అలాంటి ఒక నటుడు ఇటీవల కొరటాల శివ దృష్టిని ఆకర్షించినట్లు తెలుస్తోంది.
చిన్న హీరోలకు అవకాశం ఇవ్వాలని
కొరటాల శివ మిర్చి సినిమా నుంచి కూడా పెద్ద హీరోలతోనే సినిమా చేస్తున్నాడు. ఇంతవరకు ఆయన చిన్న స్థాయి కథలను ఎంచుకోలేదు. కనీసం మీడియామ్ హీరోలవైపు కూడా చూడటం లేదు. ప్రస్తుతం మెగాస్టార్ తో ఆచార్య సినిమా చేస్తున్న కొరటాల నెక్స్ట్ తన నుంచి ఎదో ఒక విధంగా చిన్న హీరోలకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నాడు.
కొరటాల కథలో నవీన్ పోలిశెట్టి
ఇక నెక్స్ట్ ఈ స్టార్ దర్శకుడి దృష్టి నవీన్ పొలిశెట్టిపై పడినట్లు తెలుస్తోంది. కొరటాల శివ రాసుకున్న ఒక టీనేజ్ లవ్ స్టొరీ బ్యాక్ డ్రాప్ కథకు అతను కరెక్ట్ గా సెట్టవుతాడాని ఫిక్స్ అయ్యారట. నవీన్ పొలిశెట్టి గత పదేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశాడు.
గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి..
ఇక బాలీవుడ్ లో చిచ్చొరే సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో కనిపించి మంచి క్రేజ్ అందుకున్నాడు. గత ఏడాది హీరోగా చేసిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ కూడా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది. ఆ హిట్టు తరువాత నవీన్ అగ్ర దర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఇక కొరటాల శివ కూడా నవీన్ టాలెంట్ ని గుర్తించి ఒక గోల్డెన్ ఛాన్స్ ఇవ్వబోతున్నారు.
Recommended Video
భారీ స్థాయిలో క్రేజ్ వచ్చేలా.. స్పెషల్ ప్లాన్
కొరటాల శివ డైరెక్షన్ లో కాదు కానీ.. సొంతంగా ఆయన రాసిన ఒక కథలో నవీన్ హీరోగా నటిస్తాడట. వెబ్ సిరీస్ గా రూపొందనున్న ఆ కథను సొంతంగా కొరటాల శివనే నిర్మించనున్నాడట. ఆ వెబ్ సిరీస్ లో మెయిన్ లీడ్ నవీన్ అనే తెలుస్తోంది. కథలో మంచి సందేశం ఉంటుందని టాక్. ఆ వెబ్ సిరీస్ కి భారీ స్థాయిలో క్రేజ్ వచ్చేలా ప్రమోషన్స్ చేసేందుకు కొరటాల ఒక స్పెషల్ ప్లాన్ కూడా వేశాడట. తప్పకుండా ఆ వెబ్ సిరీస్ తో నవీన్ కెరీర్ మరో యూ టర్న్ తీసుకుంటుందని టాక్.