కొరటాల మరో మూడేళ్లు ఆ హీరోలతోనే ఉంటాడా.. వేరే హీరోలు దొరకడం లేదా?
రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి స్టార్ దర్శకుల తరువాత అదే స్థాయిలో క్రేజ్ అందుకుంటున్నాడు కొరటాల శివ. ఇంతవరకు ఫెయిల్యూర్ ని చూడలేదు. దీంతో కొరటాల ప్రతి సినిమాపై అంచనాల డోస్ కూడా పెరుగుతోంది. ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ ఒక టాక్ బాగా వైరల్ అవుతోంది. మరో మూడేళ్ళ వరకు కొరటాల శివ ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలతో వర్క్ చేయబోతున్నాడట.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా అనంతరం కూడా మళ్ళీ మెగా హీరోలతోనే వర్క్ చేసే అవకాశం ఉందట. అల్లు అర్జున్ తో పాటు రామ్ చరణ్ తో కూడా కొరటాల సినిమాలు చేసే ఛాన్స్ ఉన్నట్లు చాలా రోజులుగా కథనాలు వస్తున్న విషయం తెలిసిందే.

ఇండస్ట్రీలో స్టార్ హీరోలు చాలా మంది ఉన్నా కూడా కొరటాల నెక్స్ట్ మెగా హీరోలతోనే వర్క్ చేయడానికి ఒప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ముందుగా అనుకున్న కమిట్మెంట్ ప్రకారం అనుకోకుండా కొరటాల ఇలా మెగా కాంపౌండ్ లో లాక్ అయ్యాడనే టాక్ కూడా వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











