కొరటాల శివ నెక్స్ట్ ప్రాజెక్ట్.. యువకులకు రాజకీయ సందేశం?
పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో సరైన కథ సెట్ చేసుకోవాలే గాని బాక్సాఫీస్ వద్ద ఈజీగా సక్సెస్ అందుకోవచ్చు అనే ఒక టాక్ ఉంది. ఇక కొరటాల శివ లాంటి దర్శకుడు అలాంటి కథ సెట్ చేస్తే అభిమానుల్లో అంచనాల డోస్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ ఈ స్టార్ దర్శకుడు అల్లు అర్జున్ తో పొలిటికల్ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇంతవరకు అపజయం లేని దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ తో ఆచార్య అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత ప్రాజెక్ట్ అల్లు అర్జున్ తోనే చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరి కాంబినేషన్ రాబోతున్న సినిమా పూర్తిగా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లోనే ఉండబోతోందట.

సినిమాలో యువకులు పాలిటిక్స్ లోకి వచ్చి తీరాలి అనే బలమైన సందేశాన్ని తనదైన శైలిలో చూపించబోతున్నారట కొరటాల. లాక్ డౌన్ లోనే దాదాపు స్క్రిప్ట్ పనులు అయిపోయినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ కి ఫుల్ స్క్రిప్ట్ ని మరొకసారి వినిపించాలని కొరటాల రెడీ అవుతున్నాడట. ఇక బన్నీ, సినిమాలో యువ రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నట్లు టాక్ వస్తోంది.
ప్రస్తుతం బన్నీ, సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఆ సినిమా షూటింగ్ పూర్తి కావాలి అంటే మరో ఏడాది సమయం పడుతుంది. ఆ సినిమా పూర్తయిన తరువాత ఐకాన్ సినిమాను అలాగే కొరటాల ప్రాజెక్టును ఒకేసారి సెట్స్ పైకి తేవాలని స్టైలిష్ స్టార్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











