లాక్ డౌన్ లో కొరటాల శివ సైలెంట్ ప్లాన్.. కుర్ర హీరోలే టార్గెట్?
మంచి సోషల్ పాయింట్ ని సెలెక్ట్ చేసుకొని ఆడియెన్స్ ఎక్కువగా ఆకర్షించే కొరటాల శివ ఇప్పటివరకు ఓటమిని చూడలేదు. దర్శకుడిగా మిర్చి సినిమా నుంచి భరత్ అనే నేను వరకు నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని అందుకున్నాయి. కమర్షియల్ యాంగిల్ లో మాంచి సందేశాన్ని ఇవ్వగల కొరటాల నెక్స్ట్ మెగాస్టార్ ఆచార్య సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే.
ఇప్పటివరకు స్టార్ హీరోలతోనే బిగ్ బడ్జెట్ సినిమాలను చేసిన కొరటాల శివ వచ్చే ఏడాది కుర్ర హీరోలను కూడా లైన్ లో పెట్టె అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆచార్యకు సంబంధించిన షూటింగ్ పనులు ఇంకా చాలా ఉన్నాయి. అయితే షూటింగ్ పూర్తి చేయడానికి ప్లాన్ రెడీగా ఉంది. లాక్ డౌన్ అనంతరం రెండు నెలల్లో ఆ వర్క్ ఫినిష్ చేసే ఛాన్స్ ఉందట.

ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కొరటాల ఐదేళ్లలో తన డైరెక్షన్ వర్క్ కి రిటైర్మెంట్ ఇస్తానని చెప్పాడు. ఇప్పటికే 3 స్క్రిప్ట్ లను రెడీ చేసుకున్న ఈ దర్శకుడు మరో రెండు మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ కథలను కూడా రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ లో కొరటాల ఎక్కువగా రైటింగ్ తోనే కాలాన్ని గడుపుతున్నారట. ఇక కొత్త కథలలో చాలా వరకు నేటితరం యంగ్ హీరోలే నటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మారికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











