చిరంజీవితో కోట శ్రీనివాస రావు మొదటి చిత్రం.. పవన్ కళ్యాణ్ తో ఆఖరి చిత్రం

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు కోట శ్రీనివాస రావు. ఆయన జూలై 13న తెల్లవారు జామున 4 గంటలకు హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచారు. 83 ఏళ్ల వయస్సులో ఆయన కన్నుమూశారు. కోట శ్రీనివాస రావు మరణవార్తతో సినీ ప్రముఖులు అందరూ విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళి అర్పిస్తున్నారు. చిత్ర పరిశ్రమలోని సినీ ప్రముఖులు, సినీ స్టార్స్, ప్రజా ప్రతినిధులు, వ్యాపారవేత్తలు ఆయన్ని చివరి సారిగా చూసి వెళ్తున్నారు. ఇక ఆయన అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. కోట శ్రీనివాస్ ను కోల్పోవడంతో సినీ ప్రముఖులు బాధపడుతూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు.

కోట శ్రీనివాస్ రావు సినిమాలు..
ఆంధ్రప్రదేశ్ లోని కంకిపాడులో 1942 జూలై 10న జన్మించిన కోట శ్రీనివాస రావు 1978 నుంచి చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉంటున్నారు. కమెడియన్ గా, విలన్ గా, సపోర్టింగ్ పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని పంచారు. ముఖ్యంగా ఆయన తెలంగాణ యాస, భాషలో పట్టుసాధించి ఆయా చిత్రాల్లో చెప్పిన డైలాగ్స్ ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంటున్నాయి. కోట శ్రీనివాస్ కెరీయర్ లో ఇప్పటి వరకు తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కలిపి 750కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. దాదాపు 50 ఏళ్ల పాటు చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉన్నారు.

Kota Srinivas Rao Last film with Powerstar Pawan Kalyan

చిరంజీవితో మొదటి సినిమా..
కోట శ్రీనివాస్ కెరీయర్ పద్శ విభూషన్, మెగాస్టార్, డాక్టర్ కొణిదెల చిరంజీవితోనే ప్రారంభం అయ్యింది. టాలీవుడ్ లో చిరంజీవి తొలిచిత్రం ప్రాణం ఖరీదు కావడం విశేషం. ఈ చిత్రం కంటే ముందే పునాది రాళ్లు ప్రారంభమైనా.. ప్రాణం ఖరీదు చిత్రం మొట్టమొదటగా చిరంజీవిని హీరోగా ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈ చిత్రం 1978లో విడుదలైంది. అయితే ఈ చిత్రంతోనే కోట శ్రీనివాస రావు కెరీయర్ కూడా ప్రారంభం కావడం విశేషం. ఇలా మెగాస్టార్ తోనే కోట శ్రీనివాస రావు కూడా తన కెరీయర్ ను ప్రారంభించాడు.

పవన్ కళ్యాణ్ తో కోట శ్రీనివాస్ చివరి చిత్రం..
1978 నుంచి 2025 వరకు కోట శ్రీనివాస రావు చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉన్నారు. ఎక్కడ విరామం లేకుండా వరుస బెట్టి సినిమాలు చేస్తూ వచ్చారు. ఇక చివరి రోజుల్లో కూడా ఆయా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఇక ప్రస్తుతం ఆయన కన్నుమూయడంతో మున్ముందు ఏదైనా ఒక సినిమాలో కనిపించే ఛాన్స్ ఉందా అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు.

ఈ క్రమంలో కోట శ్రీనివాస రావు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రంలో ఒక చిన్న పాత్రలో నటించారని తెలుస్తోంది. ఈ చిత్రం జూలై 24న విడుదల కాబోతోంది. ఇక ఇదే కోట శ్రీనివాస రావు చివరి చిత్రం కాబోతోంది. మెగా స్టార్ తో కెరీయర్ ను ప్రారంభించి.. ఇక పవర్ స్టార్ చిత్రంతో సినీ ప్రయాణాన్ని ముగించడం విశేషంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X