Kota Srinivas Rao Net Worth: 750కిపైగా సినిమాలు.. కోట శ్రీనివాస్ రావు ఎన్ని వందల కోట్లు సంపాదించాడో తెలుసా?
టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ రావు తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో వందల సినిమాల్లో నటించి మెప్పించారు. విభిన్న పాత్రలు పోషించి తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నారు. 50 ఏళ్లకు పైగా సినిమా ఇండస్ట్రీలో పనిచేసి ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. కొన్నాళ్లుగా సినిమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇంట్లోనే ఉన్నారు. ఇక జూలై 13న తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో ఇండస్ట్రీలోని సినీతారలు, సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే టాలీవుడ్ లో సీనియర్ నటుడిగా ఉన్న కోట శ్రీనివాస్ ఎన్ని కోట్లు సంపాదించారనే వివరాల్లోకి వెళితే..
కోట శ్రీనివాస్ కుటుంబం, వ్యక్తిగత విషయాలు..
సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ లోని కంకిపాడులో 1942 జూలై 10న జన్మించారు. కోట శ్రీనివాస్ రావు తండ్రి సీతా రామా ఆంజనేయులు డాక్టర్ వృత్తిని కొనసాగించారు. ఇక బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ లో పట్టా పొందారు. ఇక ఆయన రుక్మిణి రావును పెళ్లి చేసుకున్నారు. ఆయనకు కొడుకు, కూతుర్లు ఉన్నారు. కొడుకు వెంకట ఆంజనేయ ప్రసాద్. అతను రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోవడం బాధాకరం. ఇక కూతుర్లు పావని శ్రీనివాస్ రావు, పల్లవి శ్రీనివాస రావు ఉన్నారు. ఆయనకు తోబుట్టువులు కోటీ శంకర రావు, కోట నర్సింహ రావు కూడా ఉన్నారు. చెల్లెలు అన్నపూర్ణ ఉన్నారు. ఆయనకు మరో ముగ్గురు చెల్లెలు ఉండటం విశేషం.

కోట శ్రీనివాసరావు సినిమాలు..
1978లో చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖరీదుతో సినీ రంగంలో అడుగు పెట్టారు. ఇక 2025 వరకు ఆయన సినిమాలు చేస్తూనే వచ్చారు. దాదాపు 50 ఏళ్ల పాటు చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉన్నారు. చివరిగా కొండపొలం, హీరో, సువర్ణ సుందరి అనే చిత్రాల్లో నటించారు. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, 90లో టాలీవుడ్ ను ఏలిన స్టార్స్ చిత్రాల్లో నటించి మెప్పించారు.
కోట శ్రీనివాస రావు నెట్ వర్త్..
తెలుగు చిత్ర పరిశ్రమలో కోట శ్రీనివాస్ రావు 750కి పైగా సినిమాల్లో నటించారు. ఆయన కేవలం తెలుగు సినిమాల్లోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనే ఎన్నో గుర్తుండిపోయే చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇలా ఆయన సినిమాలతో వచ్చిన ఆదాయాన్ని కూడ బెట్టారు. ఇలా ఆయన 80 కోట్ల రూపాయలను కూడ బెట్టారని తెలుస్తోంది. ఇక ఆయన ఎలక్షన్ లో పోటీచేసే సమయంలో తన పేరుపై రూ.10 లక్షల ఆస్తి మాత్రమే ఉందని పేర్కొన్నారు.
సినీ తారల నివాళి..
కోట శ్రీనివాస్ తన 83 ఏళ్లలో తుది శ్వాస విడిచారు. ఆయన హైదరాబాద్ లోనే కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు. గత రెండు, మూడేళ్లుగా ఆయన ఆరోగ్యం సహకరించడం లేదు. దాంతో చికిత్స పొందుతూ ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక జూలై 13న ఆరోగ్యం క్షీణించి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలియడంతో సినీ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు నివాళి అర్పిస్తున్నారు.


Click it and Unblock the Notifications











