యాంకర్ అనసూయ డ్రెస్సింగ్ పై కోట శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్.. అదొక్కటే నచ్చదు అంటూ..

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతగానో కీర్తిప్రతిష్టలు అందుకున్న అతికొద్ది మంది మంచి నటుల్లో కోట శ్రీనివాసరావు ఒకరు. కోట అంటే తెలియని ప్రేక్షకులు ఉండరు. కామెడీ అయినా సీరియస్ అయినా సరే ఆయన తనదైన శైలిలో నటిస్తూ ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటారు. ఇక వయసు పెరుగుతున్నా కూడా ఆయన ఏ మాత్రం అలుపు లేకుండా కొన్ని భిన్నమైన పాత్రల్లో కూడా నటించేందుకు సిద్ధపడుతున్నారు. ఇక ఇటీవల ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాకుండా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కోటశ్రీనివాసరావు యాంకర్ అనసూయ డ్రెస్సింగ్ విధానంపై కూడా చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎన్నో విభిన్నమైన పాత్రలు

ఎన్నో విభిన్నమైన పాత్రలు

కోట శ్రీనివాసరావు సీనియర్ నటుడిగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నారు. సీరియస్ కామెడీ రోల్స్ అలాగే ఎన్నో సపోర్టింగ్ రోల్స్ తో కూడా కోట పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. తెలుగు వెండితెరపై దాదాపు అన్ని తరహా పాత్రలు చేశారు. అయితే అప్పుడప్పుడు ఆయన ఇంటర్వ్యూలలో చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అలాగే పలువురు అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తుండడం విశేషం.

మేము హాస్యం చేస్తే.. వాళ్ళు కామెడీ చేస్తున్నారు

మేము హాస్యం చేస్తే.. వాళ్ళు కామెడీ చేస్తున్నారు


కొన్ని టీవీ ఛానెల్స్ లలో వస్తున్న కామెడీ షోలపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకప్పుడు తాము హాస్యం మాత్రమే చేసేవారము అంటూ.. ఇప్పటి వారు కామెడీ చేస్తున్నారు అని తెలియజేశారు. అయితే రెండిటికీ చాలా తేడా ఉంది అంటూ మేము చేసిన హాస్యం అందరూ అన్ని వర్గాల ప్రేక్షకులు చూసే వారు అని చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా అందరూ నవ్వుకుంటూ చెప్పుకునేవారు అని అన్నారు. కానీ ఇప్పుడు చేస్తున్న కామెడీ మాత్రం అలా లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు.

 అనసూయ వేసే డ్రెస్సింగ్ నచ్చలేదు

అనసూయ వేసే డ్రెస్సింగ్ నచ్చలేదు

జబర్దస్త్ కామెడీ షో లో కూడా అలాంటి జోకులు ఎక్కువగా వాడుతున్నారు అని ఏదో రెండు మూడు డైలాగ్స్ మాత్రమే హైలెట్ అవుతున్నాయని అన్నారు. అయితే అందులో యాంకర్ అనసూయ డ్రెస్సింగ్ స్టైల్ విధానం తనకు ఏమాత్రం నచ్చలేదు అని కోట శ్రీనివాసరావు సింపుల్ గానే వివరణ ఇచ్చారు. ఆమె చక్కటి అభినయం ఉన్న నటి అంటూ చక్కగా డాన్స్ తో పాటు డైలాగ్స్ కూడా చాలా బాగా చెబుతుంది అని అయితే ఆమె వేసే డ్రెస్సింగ్ విధానం మాత్రం నచ్చలేదు అని అన్నారు

Recommended Video

Bigg Boss Telugu 5: Shanmukh @1 నామినేషన్స్‌లో టైటిల్ ఫేవరెట్లు Top 5 Contestants | Filmibeat Telugu
 మంచి టాలెంట్ ఉన్నా నటి..

మంచి టాలెంట్ ఉన్నా నటి..

మంచి టాలెంట్ ఉన్న అనసూయను ఎలా ఉన్నా కూడా చూస్తారు నిజానికి ఆమె నటన అంటే నాకు చాలా గౌరవం అలాంటి నటీమణి ఆ విధంగా జబర్దస్త్ కనిపించగానే ఎందుకో నాకు అంతగా నచ్చలేదు అని కోట శ్రీనివాసరావు క్లియర్ గానే వివరణ ఇచ్చారు. ఇక మా ఎన్నికల్లో కోట శ్రీనివాసరావు మంచి విష్ణుకు మద్దతు పలికిన విషయం తెలిసిందే. అలాగే ప్రకాష్ రాజ్ లాంటి వారిపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ఎప్పుడూ కూడా షూటింగ్ కి సమయానికి రాలేదని పలు ఇంటర్వ్యూలలో వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X