తెలుగు దర్శకులపై కోట అసహనం.. జర పట్టించుకోండయ్యా అంటూ!

Recommended Video

Kota Srinivasa Rao Request To Tollywood Directors || Filmibeat Telugu

తెలుగు తెరపై సుదీర్ఘ ప్రయాణం కొనసాగిస్తున్నారు నటుడు కోట శ్రీనివాస రావు. కమెడియన్ గా, విలన్ గా, మంచి లక్షణాలున్న తండ్రిగా ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన ఆయన దాదాపు 750 సినిమాల్లో నటించారు. సినీ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులను చూసిన ఆయన సినిమానే జీవితంగా కాలం గడిపారు. అయితే కోట శ్రీనివాస రావులో ఉన్న ముఖ్య లక్షణం కుండా బద్దలు కొట్టేస్తూ మాట్లాడటం. తాజాగా ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో కోట ఇలాగే మాట్లాడి సంచలనం సృష్టించారు.

ఉద్యోగం వదిలి సినిమాల్లోకి..

ఉద్యోగం వదిలి సినిమాల్లోకి..

తాను మొదట ప్రభుత్వ ఉద్యోగం చేసేవాడినని, హైదరాబాద్ లోని స్టేట్ బ్యాంక్ ఉద్యోగిగా ఉన్న తాను నటనపై ఉన్న ఆసక్తితో సినిమాల్లోకి వచ్చానని కోట శ్రీనివాస రావు పేర్కొన్నారు. మొదట ఉద్యోగం చేస్తూనే సినిమాల్లో నటించినప్పటికీ.. ఒక్కసారిగా సినిమా అవకాశాలు వెల్లువెత్తడంతో ఉద్యోగం వదిలి పూర్తి సమయాన్ని సినిమాలకే కేటాయిస్తూ వచ్చానని కోట చెప్పుకొచ్చారు.

వయసు పైబడటంతో కోట..

వయసు పైబడటంతో కోట..


ఎన్నో విలక్షణ పాత్రలు పోషించి స్టార్ హీరోలను మించి క్రేజ్ కొట్టేసిన కోట శ్రీనివాస రావు ఈ మధ్య కాలంలో ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదు. అప్పట్లో కొత్త సినిమా వచ్చిందంటే చాలు అందులో కోట క్యారెక్టర్ ఉండాల్సిందే అన్నట్లుగా ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. దానికి కారణం కోట వయసు పైబడటమే. కానీ కోట శ్రీనివాస రావుకు మాత్రం సినిమాలపై మోజు తగ్గలేదట.

ఇంటికే పరిమితం చేశారు.. కాస్త పట్టించుకోండయ్యా

ఇంటికే పరిమితం చేశారు.. కాస్త పట్టించుకోండయ్యా

వయసు ఎక్కువైందని తనను ఇంటికే పరిమితం చేయడం నచ్చడం లేదని పేర్కొంటూ కాస్త పట్టించుకోండయ్యా అంటూ దర్శకులను ఉద్దేశించి కామెంట్ చేశారు కోట. తనకు ఆరోగ్యం బాగానే ఉందని, ఇన్నాళ్లు రోజుకు 20 గంటల మేర కష్ట పడిన తాను ఊరికే ఇంట్లో కూర్చోవడం నచ్చడం లేదని అన్నారు. తనను కాస్త పట్టించుకుంటే సినిమాల్లో వేషాలు వేసేందుకు సిద్ధంగా ఉన్నానని అంటున్నారు కోట శ్రీనివాస రావు.

త‌ప్పుగా అనుకోవ‌ద్దు అని పేర్కొంటూ

త‌ప్పుగా అనుకోవ‌ద్దు అని పేర్కొంటూ

కాలక్షేపం కోసమైనా సినిమాల్లో నటిస్తానని చెప్పుకొచ్చారు కోట. తనకు డ‌బ్బులు ఇవ్వ‌క‌పోయినా ప‌ర్లేదు క‌నీసం వేషాలు ఇవ్వండ్రా నాయ‌నా అంటూ కొంద‌రు ద‌ర్శ‌కుల‌ను తాను అడుగుతున్న‌ట్లు ఆయన పేర్కొనడం విశేషం. ఇంట్లో ఖాళీగా ఉండటం నచ్చకే ఇలా మాట్లాడుతున్నాన‌ని.. త‌ప్పుగా అనుకోవ‌ద్దు అని అన్నారు కోట శ్రీనివాసరావు.

తెలుగు నటుల కోసం కోట

తెలుగు నటుల కోసం కోట

నటనే జీవితంగా ఎదిగిన కోట శ్రీనివాసరావుకి తెలుగు నటులంటే ఎంతో ఇష్టం. ఈ మేరకు పొరుగు భాషా నటీనటులను పక్కనబెట్టి తెలుగు నటీనటులనే ప్రోత్సహించాలని గతంలో చాలా సార్లు దర్శకులకు సూచనలిచ్చారు కోట. సీనియర్ నటుడైన కోట చెప్పిన ఈ విషయాలను ఎంతమంది దర్శకులు పట్టించుకుంటారో చూడాలి మరి!.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X