ఆంధ్రాలో జననం.. తెలంగాణతో మరోజన్మ.. కోట శ్రీనివాస్ కు సక్సెస్ మంత్ర

టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాస రావు జూలై 13న ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసిన సినీ ప్రముఖులు, తోటీ నటీనటులు, అభిమానులు, ప్రజాప్రతినిధులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆయనతో వారికి ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ గుర్తు చేసుకుంటున్నారు. కోటా శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నారు. అయితే కోట శ్రీనివాస రావు చనిపోయిన సందర్భంగా ఆయన గురించి ప్రత్యేకమైన విషయాలను చర్చించుకుంటున్నారు. ఈ సందర్భంగా కోట శ్రీనివాస రావుకు తెలంగాణతో ఉన్న ప్రత్యేక సంబంధం గురించిన వివరాల్లోకి వెళితే..

పుట్టింది ఆంధ్రాలో..
ఆంధ్రప్రదేశ్ లోని కంకిపాడులో 1942 జూలై 10న జన్మించారు కోట శ్రీనివాస రావు. చిత్ర పరిశ్రమలోకి ఎక్కువ శాతం ఏపీ నుంచే ఉండటం విశేషం. 1978లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదు చిత్రంతోనే కెరీయర్ ను మొదలు పెట్టారు. ఆ తర్వాత ఆయన ఎన్నో చిత్రాల్లో నటించే అవకాశాన్ని అందుకున్నారు. కొట శ్రీనివాస్ డిగ్రీ వరకు చదువుకున్నారు. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ లో డిగ్రీ పట్టా కూడా పొందారు. ఆయన కొడుకు వెంకట ఆంజనేయ ప్రసాద్ రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు 83 ఏళ్ల వయస్సులో కోట శ్రీనివాస రావు కూడా తుది శ్వాస విడిచారు.

Kota Srinivasa Rao stand in Film Industry with Telangana Slang

తెలంగాణ యాసపై పట్టు సాధించి..
కోట శ్రీనివాస్ రావు తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. అయితే ఆయనకు గుర్తింపు తెచ్చి పెట్టింది మాత్రం తెలంగాణ యాస, భాష మాత్రమే. విలన్ గా, కమెడియన్ గా ఎన్నో పాత్రలు పోషించిన ఆయన తెలంగాణ పదాలు, భాష, యాసపై పట్టుసాధించి ఒక్కసారిగా రైజ్ అయ్యారు. అప్పట్లో తెలంగాణ యాసను సినిమాల్లో చాలా తక్కువ చూపించే వారు. ఆ సమయంలో కోట శ్రీనివాస రావు తెలంగాణ యాసలో అదరగొట్టి మాస్ ఆడియెన్స్ నుంచి ప్రశంసలు అందుకున్నారు.

1985లో వచ్చిన ప్రతిఘటన చిత్రంలో మొదటిసారిగా తెలంగాణ డైలెక్ట్ తో కోట సినివాస రావు డైలాగ్స్ చెప్పారు. ఆ తర్వాత నుంచి ఆయనకు ఎక్కువగా హైదరాబాదీ యాస, అచ్చ తెలంగాణ యాసకు సంబంధించిన పాత్రలు వచ్చాయి. యోగి, అతడు, బొమ్మరిల్లు, దూకుడు, జూలాయి, ఆ నలుగురు, ఛత్రపతి, ఇడియట్ వంటి చిత్రాల్లో ఆయన వాడిన యాస ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది. ఇప్పటికీ ఆయన డైలాగ్స్ ను మీమ్స్ లో చూస్తూనే ఉన్నాం.

కోట శ్రీనివాస్ కెరీయర్..
చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖరీదుతో సినీ రంగంలో అడుగు పెట్టారు కోట శ్రీనివాస్. 1978 నుంచి 2025 వరకు ఆయన చిత్ర పరిశ్రమలో చాలా యాక్టివ్ గా కనిపించారు. 750కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. 47 ఏళ్ల పాటు సినిమా పరిశ్రమలో అనుభవం కలిగి ఉన్నారు. మరోవైపు భారతీయ జనతా పార్టీలో చేరి ఎమ్మెల్యేగానూ ఎన్నికై ప్రజలకు సేవనందించారు. 2015లో ఆయనకు పద్మశ్రీ అవార్డు దక్కడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X