For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Kota SrinivasaRao : జబర్దస్త్ ఆర్టిస్ట్ అలా అరిచాడంటూ..దర్శకులను కూడా వదల్లేదు..సభ్యత లేకుండా డబ్బుంటే చాలా?

  |

  ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు తాజా యూట్యూబ్ ఇంటర్వ్యూ సంచలనాలకు మారుపేరుగా మారింది. యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆయన పంచుకున్న విషయాలు ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.. ఎన్టీఆర్ తో గొడవ బాలకృష్ణ తో వ్యవహారం గురించి అనేక సంచలన విషయాలు బయటపెట్టిన కోట శ్రీనివాసరావు ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్ గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

   గౌరవం లేదు

  గౌరవం లేదు

  ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒకప్పటి నటులను గౌరవించడం లేదు అని మీరు భావిస్తున్నారా అని ప్రశ్నించగా ఏ మీరు భావించడం లేదా మీరు భావిస్తున్నారు కాబట్టే కదా మమ్మల్ని ఆ ప్రశ్న అడిగారు అని రివర్స్లో కౌంటర్ వేశారు కోట శ్రీనివాసరావు.. అంతేకాక కచ్చితంగా ప్రస్తుతం ఉన్న వాళ్లు తమను గౌరవించడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటి తరం వారికి పెద్దలను గౌరవించాలి అన్న విషయం గుర్తు చేయాల్సి వస్తోందని గుర్తు చేస్తున్నా సరే వాళ్ళు దానిని పట్టించుకున్న దాఖలాలు అయితే తనకు కనిపించడం లేదని కోట శ్రీనివాసరావు అన్నారు. ఇక తనకు అనుభవంలోకి వచ్చిన ఒక సంఘటన గురించి చెబుతాను అని చెబుతూ ఆయన ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్ గురించి కామెంట్ చేశారు.

  జబర్దస్త్ ఆర్టిస్ట్

  జబర్దస్త్ ఆర్టిస్ట్

  తాను ఒక సినిమా షూటింగ్ కు వెళ్లాలని అయితే అక్కడ ఒక వ్యక్తి వచ్చి గట్టి గట్టిగా అరుస్తూ మాట్లాడడం తాను గమనించానని అన్నారు. దీంతో ఏమైంది అని అడగగా ఇద్దరు వ్యక్తులకు కలిపి కేరవాన్ లో ఒకే రూమ్ ఇచ్చారు అని అందుకే ఆయన అరుస్తున్నారు అని ప్రొడక్షన్ వాళ్ళు చెప్పారని కోట శ్రీనివాసరావు పేర్కొన్నారు. అసలు ఆయనని ఎప్పుడూ చూడలేదు కదా ఎవరు ఆయన అని అడిగితే ఆయన జబర్దస్త్ ఆర్టిస్ట్ అండీ అని సమాధానం ఇచ్చారట. జబర్దస్త్ ఆర్టిస్ట్ అంటే నేనింక జబర్దస్త్ ఫా నటించే ఆర్టిస్ట్ అనుకున్నానని ఆ తర్వాత అతను జబర్దస్త్ అనే ఒక కార్యక్రమంలో వచ్చే నటుడని తనకు తెలిసింది అని చెప్పుకొచ్చారు. ప్రొడక్షన్ వాళ్ళ ఇబ్బందులు అర్థం చేసుకోకుండా ఒకే రూమ్ ఇవ్వడం అనే విషయాన్ని పట్టుకుని అలా అరవడం ఏ మాత్రం సభ్యత అని ఆయన ప్రశ్నించారు.

   కేరవాన్ అనే మాటకే చోటు లేదు

  కేరవాన్ అనే మాటకే చోటు లేదు

  ఇక తన కెరీర్ లో ఈ కేరవాన్ అనే మాటకే చోటు లేదని తనకు మొదటి నుంచి కూడా చెట్ల కింద మేకప్ వేసుకోవడమే అలవాటు అని ఇప్పటికీ అదే పద్ధతి ఫాలో అవుతుంటాను అని అన్నారు. కేరవాన్ ఎక్కడం అంటే అది ఒక ఐసీయూలో మొదలు పెట్టినట్లు అనిపిస్తూ ఉంటుంది అని గట్టిగా చేయి ఎత్తితే చేతికి తగులుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువగా దానిని ప్రిఫర్ చేయను అని గతి లేని పరిస్థితిలో మాత్రమే దానిని వాడతానని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. ఇక ఆ జబర్దస్త్ ఆర్టిస్ట్ పేరు చెప్పకుండా అడగ్గా ఆయన పేరు నాకు తెలియదు అని కోట శ్రీనివాసరావు దాటవేశారు. అలాగే జబర్దస్త్ ఆర్టిస్టులకు కూడా అవకాశాలు వస్తున్నాయి కదా అని ప్రశ్నించగా జబర్దస్త్ లో వచ్చిన అవకాశం సినిమాల్లో ఎందుకు రావడం లేదు సినిమాల్లో వాళ్లకి సత్తా లేదా ? తాను అయితే లేదనే చెబుతానని ఆయన అన్నారు..

  టాలెంట్ ఉన్నా

  టాలెంట్ ఉన్నా

  పని విషయంలో శ్రద్ధ ఉండాలని అది లేకుండా ఎంత టాలెంట్ ఉన్నా అది ఉపయోగపడదని కోట శ్రీనివాసరావు అన్నారు.. ఇక బీటెక్ చేసి దర్శకత్వం చేయడానికి వస్తున్న దర్శకులుగా చేస్తున్న దర్శకుల గురించి కూడా కోటా శ్రీనివాస రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. బీటెక్ చదివిన వాళ్ళు దర్శకత్వం అలాగే సినిమాల మీద మక్కువతో ఇక్కడికి వస్తున్నారని అది కరెక్ట్ పద్ధతి కాదని ఆయన అన్నారు. ఎందుకంటే ఎన్నో ఆశలతో వాళ్ళ తల్లిదండ్రులు బీటెక్ చదివింది ఉంటారని దానిని సద్వినియోగం చేసుకోకుండా సినిమాలు అంటూ తిరగడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. ఒక సినిమాని దర్శకత్వం వహించాలనే 24 విభాగాల్లో మీద పట్టు ఉండాలని అప్పుడే దర్శకుడు రాణిస్తాడు అని ఆయన అన్నారు.

  Greatest Indian Classics - Episode 1 | Sagara Sangamam, కమల్ నట విశ్వరూపం || Filmibeat Telugu
  బీటెక్ చదివి

  బీటెక్ చదివి

  డైరెక్టర్ అంటే అకౌంటెంట్ అని డైలాగులకు, డిక్షన్ అలాగే నిడివి మొత్తానికి అన్ని విషయాలకు ఆయనే ఒక ఎకౌంటెంట్గా వ్యవహరించాలని కానీ ఇప్పుడు వస్తున్న దర్శకులు ఎవరు ఇలాంటి విషయాలు నేర్చుకోకుండా సినిమాలు చేస్తున్నారని అన్నారు. వాళ్లే దర్శకత్వం చేసుకుని వాళ్ళే కధలు రాసుకుని వాళ్లే రిలీజ్ చేసుకుని వాళ్లే చూసుకుంటున్నారని అంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఒక కుర్రవాడిని అడిగానని దర్శకత్వ విభాగంలో పని చేయడానికి ఎందుకు వచ్చావు అంటే తనకు దర్శకత్వం మీద ఆసక్తి ఉందన్నాడు అని అన్నారు. అయితే ఏం చదువుతున్నావు అని అడిగితే బీటెక్ చదివా అన్నాడని మరి బీటెక్ చదివి ఇందులో కి ఎందుకు వచ్చావు అంటే బీటెక్ తన తల్లిదండ్రుల బలవంతంతో చదివానని ఇది తనకు ఇష్టమైన రంగం కాబట్టి ఇందులో రాణించడానికి వచ్చానని అన్నాడు అని అన్నారు. మొత్తం మీద కోట శ్రీనివాస రావు వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు సంచలనంగా మారింది అని చెప్పక తప్పదు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని ఆయన అనడం గమనార్హం.

  English summary
  In a recent interview Kota Srinivasa Rao made some interesting comments on jabardasth artist.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X