twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్నేహానికి, స‌హ‌జీవ‌నానికి తేడా అదే.. ప్రియాంత్‌

    |

    ముక్కు సూటిగా ఉంటే వ‌చ్చే చిక్కుల గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. అలా ఉండే కుర్రాడు ఓ అమ్మాయి విష‌యంలోనూ సూటిగా ఉంటే ఆ త‌ర్వాత ఎదురైన ప‌రిణామాలేంటి? అన్నదే మా సినిమా.. స్నేహానికి స‌హ‌జీవ‌నానికి మ‌ధ్య ఉండే ఓ స‌న్న‌ని లైన్ ఏంటో తెరపై చూడండి.. అంటున్నారు ప్రియాంత్. ఈ న‌వ‌త‌రం హీరో న‌టించిన చిత్రం కొత్త‌గా మా ప్ర‌యాణం. ప్రియాంత్‌ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ.. నిశ్చ‌య్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై తెర‌కెక్కుతోంది. యామిని భాస్క‌ర్ క‌థానాయిక‌. ఈ వ‌ర్షం సాక్షిగా ఫేం ర‌మ‌ణ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇటీవ‌లే టీజ‌ర్ రిలీజై ఆక‌ట్టుకుంది. టీజ‌ర్ ఆద్యతం ఫ‌న్, ల‌వ్, యాక్ష‌న్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్ మెప్పించాయి. భాను, గిరి, ఈరోజుల్లో సాయి, జీవా, కారుణ్య త‌దిత‌రులు తారాగ‌ణం. ఈ నెల 25న సినిమా ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతోంది. హైద‌రాబాద్ లో జ‌రిగిన ఇంట‌ర్వ్యూలో ప్రియాంత్ చెప్పిన సంగ‌తులివి..

    కార్తీక్ అనే ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి పాత్ర‌లో న‌టించాను. నెల‌కు రూ.2ల‌క్ష‌లు సంపాదించే కుర్రాడి లైఫ్ స్టైల్ పై సినిమా ఇది. హార్డ్‌ కోర్ మెంటాలిటీ.. ముక్కుసూటి గా ఉండే కుర్రాడి క‌థ‌. త‌న‌కు ఏదైనా కావాలి అనుకుంటే కావాలి అంతే. న‌లుగురికి సాయ‌ప‌డ‌తాడు. ఒక అమ్మాయితో సూటిగా మాట్లాడాక క‌థ ఏ మలుపు తిరిగింది అన్న‌దే సినిమా. ఇప్పుడు ఉన్న సాఫ్ట్ వేర్ క‌ల్చ‌ర్ లో ఎవ‌రెలా ఉంటున్నారో తెలిసిందే.

    Kottaga Ma Prayanam about live in relations

    అమ్మాయితో అబ్బాయి స్నేహంపై సినిమా ఇది. అలాగని లివిన్ రిలేష‌న్ షిప్‌పై సినిమా కాదు. సినిమాలో గ్లామ‌ర్ కి ఆస్కారం ఉంది. అలాగని హ‌ద్దు మీరిన రొమాన్స్ ఉండ‌దు. స‌న్నివేశం డిమాండ్ మేర‌కు ఉంటుంది. టీనేజ‌ర్ ప్రేమ‌క‌థ‌ల్లో అది త‌ప్ప‌నిస‌రి. ట్రైల‌ర్ చూస్తే మీకు అర్థ‌మై ఉంటుంది. మా ట్రైల‌ర్ కి స్ప ంద‌న బావుంది. ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కించారు. నిర్మాణ విలువ‌లు ఆక‌ట్టుకుంటాయి.

    నేటి త‌రానికి త‌ల్లిదండ్రుల నుంచి కండిష‌న్లు లేవు. స్వేచ్ఛా జీవ‌నానికి అల‌వాటు ప‌డితే ఎలా ఉంటుంది? హాస్ట‌ల్స్ లో ఉండే కుర్రాళ్ల లైఫ్ ఎలా ఉందో చూపించాం. అయితే స్వేచ్ఛ ఇచ్చినా బాధ్య‌త‌గా ఉండాల‌నే సందేశం ఆక‌ట్టుకునేలా తీర్చిదిద్దారు.

    Kottaga Ma Prayanam about live in relations

    నాన్న డాక్ట‌ర్‌. నేను ఎస్‌.బ్యాంక్ లో ఒక డైరెక్ట‌ర్‌గా ప‌ని చేశాను. జూబ్లీహిల్స్ బ్రాంచ్ లో 9ఏళ్ల అనుభ‌వం ఉంది. ఆ క్ర‌మంలోనే ఏడెనిమిదేళ్లుగా ఇండ‌స్ట్రీలో క‌థానాయ‌కుడిగా ట్ర‌య‌ల్స్ లోనే ఉన్నాను. ఇప్ప‌టికి అవ‌కాశం ద‌క్కింది. న‌ట‌న ప‌రంగా నాకు ఎలాంటి శిక్ష‌ణ లేదు. ప్ర‌య‌త్నంతోనే ఈ అవ‌కాశం ద‌క్కింది.

    ఈ సినిమా అన్ని సినిమాల్లా.. రొటీన్ గా ఉండ‌దు అని నేను చెప్ప‌ను. అయితే యువ‌త‌రం ఎలా ఉన్నారు? అన్న‌ది తెర‌పై చూపిస్తున్నాం. చ‌క్క‌ని ఫీల్ తో సినిమా సాగుతుంది. త‌ల్లిదండ్రులు, బంధువులు పిల్ల‌ల క‌ల్చ‌ర్ వ‌ల్ల ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదుర్కొంటారు? అన్న‌ది తెర‌పై చూడొచ్చు. అమ్మాయి- అబ్బాయి క‌లిసి ఉంటే సంఘంలో ఎలా మాట్లాడుకుంటారు? పేరెంట్ కి ఎలాంటి స‌మ‌స్య‌లొస్తాయి? అన్న‌ది చూడొచ్చు.

    ఈ సినిమాని స్నేహితుల‌తో క‌లిసి తెర‌కెక్కించాం. నిర్మాత‌లు మా వాళ్లే కాబ‌ట్టి ఇండ‌స్ట్రీలో అనుభ‌వ‌జ్ఞుడిగా అన్నీ నేనే చూసుకున్నా. ప్ర‌ధాన పాత్ర‌ధారుల్లో ఈ రోజుల్లో సాయి, అలాగే బిగ్ బాస్ భానుశ్రీ త‌దిత‌రులు చ‌క్క‌ని పాత్ర‌ల్లో న‌టించారు. చిన్న సినిమాల‌కు థియేట‌ర్ల స‌మ‌స్య ఏమీ లేదు. థియేట‌ర్ల‌కు రెంట్లు క‌ట్ట‌డం సినిమాలు వేసుకోవ‌డం అంతే క‌దా!

    English summary
    New Hero Priyanth's movie is Kottaga Ma Prayanam. Yamini Bhasker Heroine. Ramana is directed this movie. This movie set to release on Jan 25th. In this occassion, Priyanth shares his experiences.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X