For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ‘కొత్త‌గా మా ప్ర‌యాణం’.. యూత్‌ని టార్గెట్‌గా చేస్తూ..

    |

    టాలీవుడ్‌కు ప్రియాంత్‌ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ నిశ్చ‌య్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై తెర‌కెక్కుతున్న యూత్‌ఫుల్ అండ్ బ్యూటిఫుల్ సినిమా కొత్త‌గా మా ప్ర‌యాణం. యామిని భాస్క‌ర్ క‌థానాయిక‌. ఈ వ‌ర్షం సాక్షిగా ఫేం ర‌మ‌ణ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. నిర్మాణానంత‌ర ప‌నులు తుదిద‌శ‌కు చేరుకున్నాయి.

    ఓ వైపు కొత్తగా మా ప్రయాణం సినిమాను రిలీజ్‌కు సిద్దం చేస్తూనే ఇటీవల ఈ సినిమా టీజ‌ర్ రిలీజ్ చేశారు. టీజ‌ర్ ఆద్యంతం ఫ‌న్, ల‌వ్, యాక్ష‌న్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ షేడ్స్‌తో ఆక‌ట్టుకుంటోంది. ఈ టీజర్‌లోని యాక్ష‌న్ కంటెంట్‌, పంచ్ డైలాగ్‌లు విశేషంగా ఆకట్టుకొంటున్నాయి.

    ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ మాట్లాడుతూ న‌లుగురికి సాయ‌ప‌డుతూ ఓపెన్ మైండెడ్‌గా ఉండే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రేమ‌క‌థ ఇది. న‌లుగురికి సాయ‌ప‌డే త‌త్వం ఉన్న అత‌డికి ప్రేమ‌, పెళ్లి, కుటుంబం వంటి విలువ‌ల‌పై అంతగా న‌మ్మ‌కం ఉండ‌దు. అయితే అలాంటివాడు మ‌న సాంప్ర‌దాయం విలువ‌ను, గొప్ప‌త‌నాన్ని తెలుసుకుని, ప్రేమ, పెల్లి వైపు ఎలా మారాడు? అన్న‌ది ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా చూపించాం.

    Kottaga Maa Prayanam is youthful and romantic entertainer

    నెల‌కు 2ల‌క్ష‌ల జీతం అందుకునే సాఫ్ట్‌వేర్ కుర్రాడి క‌థ ఇది. ప్రియాంత్ కి తొలి సినిమానే అయినా త‌డ‌బ‌డ‌కుండా చ‌క్క‌గా న‌టించాడు. యామిని భాస్క‌ర్ అంద‌చందాలు ఈ సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌. ఆ ఇద్ద‌రికీ పేరొస్తుంది. యువ‌త‌రాన్ని టార్గెట్ చేసి తీసిన ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్‌లో రిలీజ్ చేస్తున్నాం అని రమణ అన్నారు.

    భాను, గిరి, ఈరోజుల్లో సాయి, జీవా, కారుణ్య త‌దిత‌రులు న‌టించారు. పాట‌లు: రామ‌జోగ‌య్య శాస్త్రి, క‌రుణాక‌ర్‌, సంగీతం: సునీల్ క‌శ్య‌ప్‌, సాయి కార్తీక్, కెమెరా: అరుణ్ కుమార్, ఎడిటింగ్‌: న‌ంద‌మూరి హ‌రి.

    English summary
    Kottaga Maa Prayanam is youthful and romantic entertainer. Debut hero Priyanth and Yamini Bhaskar is the lead pair. Ee Varsham Sakshi Ga Fame Ramana is the Director. This movie teaser getting good response from all the corner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X