twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కౌసల్య కృష్ణమూర్తి ట్రైలర్.. ఆసక్తికర సన్నివేశాలు.. వెరీ ఇన్స్పైరబుల్

    |

    క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై కేఎస్ రామారావు సమర్పణలో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్‌'. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇందులో భాగంగా ఈ రోజు (ఆగస్టు 19) న ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు.

    తండ్రి కోసం క్రికెట్ పట్ల ఆసక్తి పెంచుకున్న కౌసల్య అనే అమ్మాయి ఎలాంటి పరిస్థితులను ఎదిరించి క్రికెటర్‌గా ఎదిగిందనేది ఈ ట్రైలర్లో చూపించారు. ఎన్నో ఆసక్తికర సన్నివేశాలతో కట్ చేయబడిన ఈ ట్రైలర్‌లో 'నీ వల్ల కాదూ అంటే నువ్వు నమ్మాల్సింది వాళ్లను కాదు .. నిన్ను', 'ఈ లోకం గెలుస్తానని చెబితే వినదు.. గెలిచిన వాళ్ల మాట మాత్రమే వింటుంది.. నువ్వు ఏం చెప్పినా గెలిచి చెప్పు' అనే డైలాగ్స్ హైలైట్ అవుతున్నాయి. విడుదలైన కాసేపట్లోనే ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ అయింది. ట్రైలర్ చుసిన నెటిజన్లు వెరీ ఇన్స్పైరబుల్ అని కితాబిస్తున్నారు.

     Kousalya Krishnamurthy Trailer: Very Inspirable

    క్రికెట్ నేపథ్యంలో ఒక మంచి కంటెంట్‌ మూవీగా 'కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్‌' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చిత్రంలో నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, ఐశ్వర్యా రాజేష్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌, 'రంగస్థలం' మహేశ్‌, విష్ణు(టాక్సీవాలా ఫేమ్‌), రవిప్రకాశ్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

    ఇక ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: దిబు నినన్‌, కథ: అరుణ్‌రాజా కామరాజ్‌, మాటలు: హనుమాన్‌ చౌదరి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, కృష్ణకాంత్‌(కెకె), కాసర్ల శ్యామ్‌, రాంబాబు గోసల, అందిస్తున్నారు.

    English summary
    Different storyline movie Kousalya Krishnamurthy which is directed by Bhimaneni Srinivasa Rao. This movie trailer launched now.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X