దర్శకేంద్రుడి ఇంట్లో విషాదం.. రాఘవేంద్ర రావు సోదరుడి మృతి
టాలీవుడ్ దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరురు అకస్మాత్తుగా మృతి చెందడంతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. దర్శకేంద్రుడి సోదరుడిగానే కాకుండా ఆర్.కె. ఫిలిమ్స్ అధినేత, నిర్మాతగా సినీ పరిశ్రమకు సేవలు అందించారు. ఆయన అకాల మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
దర్శకేంద్రు రాఘవేంద్రరావు సోదరుడు, నిర్మాత కె.కృష్ణమోహనరావు కన్నుమూశారు. ఆర్.కె. ఫిలిమ్స్ అధినేత, ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు సోదరుడు కోవెలమూడి కృష్ణమోహన్ రావు ఫిలిమ్ నగర్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కృష్ణమోహన్ రావు గత కొంత కాలంగా ఊపిరి తిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు.

ఊపిరితిత్తుల సమస్య అధికం కావడంతో నేటి మధ్యాహ్నం కృష్ణమోహన్ రావు మరణించారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు. రేపు ఫిలిమ్ నగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగనున్నాయి. ప్రస్తుతం సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications