పూజా హెగ్డేపై రాఘవేంద్రరావు చిలిపి కామెంట్.. అంతా షాక్.. వెంటనే ఆమె రియాక్షన్!

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ దర్శకుడిగా వెలుగొందుతూ యువ దర్శకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు రాఘవేంద్రరావు. ఆయన సినిమాలంటే సినిమాలు, అందులో హీరోయిన్ల అందాలంటే ఆ నాటి నుంచి నేటి వరకు యువతరానికి అదో క్రేజ్. అలాంటి రాఘవేంద్రరావు ఓ యంగ్ హీరోయిన్‌తో చిలిపిగా మాట్లాడితే.. ఇంకేమన్నా ఉందా! అదే జరిగింది 'వాల్మీకి' సాంగ్ రిలీజ్ వేదికపై. వివరాల్లోకి పోతే..

వాల్మీకిలో 'ఎల్లువచ్చే గోదారమ్మ..'

వాల్మీకిలో 'ఎల్లువచ్చే గోదారమ్మ..'

శోభన్‌బాబు, శ్రీదేవి జంటగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన 'దేవత' సినిమాలోని 'ఎల్లువచ్చి గోదారమ్మా' పాటను రీమిక్స్ చేసి తాజా సినిమా 'వాల్మీకి' లో పెట్టారు. ఈ సాంగ్ ప్రోమో విడుదల సందర్బంగా రాఘవేంద్రరావును ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అయితే ఈ వేదికపై పూజా హెగ్డేపై రాఘవేంద్రరావు చేసిన కామెంట్ అందరినీ ఆశ్చర్యపరిచింది.

పూజా హెగ్డే, వరుణ్ తేజ్ ఇరగదీశారు

తాజాగా విడుదలైన 'ఎల్లువచ్చి గోదారమ్మా' ప్రోమో సాంగ్‌లో పూజా హెగ్డే, వరుణ్ తేజ్ ఇరగదీసే పెర్ఫార్మ్ చూపించారు. అప్పట్లో శోభన్ బాబు, శ్రీదేవిని మరోసారి గుర్తుచేస్తూ ఆడియన్స్‌కి స్పెషల్ కిక్ ఇచ్చారు. దీంతో ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి వేగంగా వ్యూస్ రాబడుతోంది.

పూజా హెగ్డేను ఉద్దేశిస్తూ దర్శకేంద్రుడు

పూజా హెగ్డేను ఉద్దేశిస్తూ దర్శకేంద్రుడు

పూజా హెగ్డేను మొదటి సారి చూడాగానే అనుకున్నాను ఈ అమ్మాయి టాప్ హీరోయిన్ అవుతుందని. ఇక వరుణ్ తేజ్ సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. దర్శకుడు హరీష్ శంకర్ అద్భుతమైన సినిమాలు తీస్తున్నాడు. నేను చాలా హ్యాపీ. హరీష్ కి ఇంకా మరిన్ని హిట్లు రావాలని కోరుకుంటున్నా అని పేర్కొంటూ ఆసక్తికరంగా మాట్లాడారు రాఘవేంద్రరావు.

పూజా చిన్న కోరిక అంటూ రాఘవేంద్రరావు

పూజా చిన్న కోరిక అంటూ రాఘవేంద్రరావు

పూజా నాకో చిన్న కోరిక ఉంది.. ఇస్తావా? అని అడిగిన దర్శకేంద్రు.. హరీష్, ‘పూజా హెగ్డే ఏ బిందెను అయితే నడుము పెట్టుకుందో ఆ బిందెను నాకు గిఫ్ట్‌గా ఇచ్చి పంపిస్తావా? అని అనేశారు. దీంతో ఆయన చిలిపి కోరిక విని అందరూ షాక్ అయ్యారు. ఇక పూజా అయితే పడిపడి నవ్వేసింది.

రాఘవేంద్రరావుకు హరీష్ శంకర్ ప్రశ్న

రాఘవేంద్రరావుకు హరీష్ శంకర్ ప్రశ్న

చివరగా రాఘవేంద్రరావును హరీష్ శంకర్ మరో ప్రశ్న వేయడంతో దర్శకేంద్రుడు ఇచ్చిన సమాధానం చూసి వేదిక ప్రాంగణమంతా నవ్వులతో హోరెత్తింది. పూజను చూస్తే మీకు ఏ పండుతో కొట్టాలని పిస్తుందని హరీష్ శంకర్ అడగగా.. చెర్రీ అయితే బాగుంటుంది అంటూ మొహమాటం లేకుండా చెప్పేశారు రాఘవేంద్రరావు. దీంతో ఈ వేడుకలో ఆయన మాటలే స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి.

వాల్మీకి మూవీ

వాల్మీకి మూవీ

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందింది 'వాల్మీకి' సినిమా. తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ' సినిమాకి రీమేక్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిత్రంలో వరుణ్ తేజ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. తమిళ నటుడు అథర్వా మురళి విలన్‌గా కనిపించనున్నాడు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 20వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X