దొరసానిపై రాఘవేంద్రరావు కామెంట్.. జీవితా రాజశేఖర్ ఇలా ఫీల్ కావాలంటూ
కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'దొరసాని'. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, శివాత్మిక జంటగా నటించారు. హిస్టారికల్ లవ్ స్టోరీగా చాలా ఏళ్ల క్రిందటి నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను మధుర ఎంటర్‌టైన్మెంట్స్, బిగ్‌బెన్ సినిమాస్ బ్యానర్లపై యశ్ రంగినేని, మధురా శ్రీధర్ సంయుక్తంగా నిర్మించారు. చిత్రానికి దగ్గుబాటి సురేశ్‌బాబు సమర్పకుడిగా వ్యవహరించారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం సమకూర్చారు. జులై 12 వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండకు, జీవిత రాజశేఖర్ కుమార్తె శివాత్మికకు 'దొరసాని'యే మొదటి సినిమా. ఇందులో ఇద్దరి అభినయానికి మంచి మార్కులు పడుతున్నాయి. దొరసాని చూసిన సినీ ప్రముఖులు ఈ ఇద్దరిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అవుతూ కామెంట్ పోస్ట్ చేశారు.

ఎమోషన్స్ అన్నీ కలగలిపి చిత్రీకరించిన అందమైన సినిమా 'దొరసాని'. ఈ పాత్రకు తను పర్‌ఫెక్ట్ అనే విషయాన్ని శివాత్మిక తన నటనతో నిరూపించింది. రాజశేఖర్, జీవిత ఆమె చూపిన అభినయం పట్ల గర్వపడాలి. చిత్రంలో ఆనంద్ దేవరకొండ కూడా అద్భుతంగా నటించాడు. మీ ఇద్దరికీ మంచి భవిష్యత్తు ఉంది. మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు అని రాఘవేంద్ర రావు పేర్కొన్నాడు. ప్రస్తుతం 'దొరసాని' డీసెంట్ కలెక్షన్స్ రాబడుతూ విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.


Click it and Unblock the Notifications











