ఆరోజు నుంచే ఆహాలో రవితేజ ‘క్రాక్’ మూవీ: రిలీజ్ డేట్‌ను ప్రకటించిన సంస్థ

వరుస పరాజయాలతో సతమతం అవుతోన్న మాస్ మహారాజా రవితేజ.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించిన మూడో చిత్రం 'క్రాక్'. 'డాన్ శ్రీను', 'బలుపు' వంటి హిట్ల తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం అన్ని ప్రాంతాల్లో సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో పాటు కలెక్షన్ల సునామీ సృష్టించింది. దీంతో కేవలం ఐదు రోజుల్లో బ్రేక్ ఈవెన్‌ను అందుకోవడంతో పాటు ఇప్పటికి మొత్తంగా రూ. 18 కోట్లకు పైగా లాభాలను సంపాదించుకుని రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసింది.

ఇక, ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుంది తెలుగు ఓటీటీ సంస్థ 'ఆహా'. ఒప్పందం ప్రకారం.. ఈ సినిమాను జనవరి 29నే స్ట్రీమింగ్ చేయాల్సి ఉంది. కానీ, ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్‌ను దృష్టిలో ఉంచుకున్న నిర్మాత.. దాన్ని వాయిదా వేయాలని సంస్థను కోరాడు. దీంతో 'క్రాక్' డిజిటల్ ప్రీమియర్‌ను తాత్కాలికంగా నిలిపి వేసినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 5 నుంచి ఆహా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తాజాగా ఆ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. దీంతో రవితేజ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Krack World Digital Premiere Date Announced

మొదటి నుంచీ హిట్ టాక్‌తో దూసుకుపోతోన్న 'క్రాక్' మూవీ.. ఇప్పటికీ కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేస్తుంది. మరీ ముఖ్యంగా ఇందులో మాస్ మహారాజా యాక్టింగ్.. గోపీచంద్ మలినేని టేకింగ్.. ఎస్ ఎస్ థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్.. రామ్ లక్ష్మణ్ ఫైట్స్.. జీకే విష్ణు కెమెరా గొప్పతనం ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. అలాగే, సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ నెగెటివ్ యాక్టింగ్ కూడా బాగా ఆకట్టుకుందనే చెప్పాలి. హీరోయిన్ శృతి హాసన్ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక, ఈ చిత్రాన్ని సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్‌పై ఠాగూర్ మధు నిర్మించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X