twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హరిహర వీరమల్లు కోసం క్రిష్ పక్కా ప్లాన్: ఆ ఫొటో బయటకు రావడంతో అంచనాలు రెట్టింపు

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ బడా హీరోగా వెలుగొందుతున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. రాజకీయాల కోసం సినిమాలకు గ్యాపిచ్చిన అతడు.. మూడేళ్ల విరామం తర్వాత 'వకీల్ సాబ్' అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ ఫిల్మ్ సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాదు, గతంలో ఎన్నడూ రాని విధంగా దీనికి కలెక్షన్లు కూడా దక్కాయి. దీంతో రెట్టించిన ఉత్సాహంతో పవన్ కల్యాణ్ ప్రాజెక్టులను షురూ చేస్తున్నాడు. ఇలా ఇప్పటికే పలు సినిమాలను కూడా మొదలు పెట్టేసి.. ఆయా సినిమా షూటింగ్‌లలో పాల్గొంటున్నాడు. ఇక, ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న చిత్రాల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి.

    NTR30: ఎన్టీఆర్ - కొరటాల సినిమాకు పవర్‌ఫుల్ టైటిల్.. కథతో పాటు హీరో పాత్ర వివరాలు లీక్NTR30: ఎన్టీఆర్ - కొరటాల సినిమాకు పవర్‌ఫుల్ టైటిల్.. కథతో పాటు హీరో పాత్ర వివరాలు లీక్

    టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న సినిమానే 'హరిహర వీరమల్లు'. పిరియాడిక్ జోనర్‌లో మొగల్ కాలం నాటి కథతో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైంది. అయితే, ఆ తర్వాత దీనికి చాలా సార్లు ఆటంకం ఏర్పడింది. దీంతో షూటింగ్ అంతకంతకూ ఆలస్యం అవుతూనే వస్తోంది. అంతేకాదు, మెయిన్ సీక్వెన్స్ మొత్తం వాయిదా పడిపోయింది. దీంతో దీనికి సంబంధించి దాదాపు యాభై శాతం మాత్రమే చిత్రీకరణ పూర్తైనట్లు తెలుస్తోంది. మిగిలిన భాగం కోసం కొత్త షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నారు.

    Krish Met Sham Kaushal for Harihara Veeramallu

    'హరిహర వీరమల్లు' కొత్త షెడ్యూల్ కోసం హైదరాబాద్‌లో భారీ సెట్‌లను నిర్మిస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ సినిమా షూటింగ్‌ను షురూ చేయబోతున్నాడని తెలిసింది. ఆ లోపు ఎర్రకోట, చార్మినార్‌కు సంబంధించిన సెట్టింగులను పూర్తి చేయనున్నారు. ఒకసారి ఈ షూట్ మొదలైతే సినిమా పూర్తయ్యే వరకూ ఆపకుండా ఉండేలా దర్శక నిర్మాతలు ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. దీంతో మెగా అభిమానులు మరింత సంతోషిస్తున్నారు.

    Pushpa మూవీపై గరికపాటి సంచలన వ్యాఖ్యలు: వాడు హీరోలా బిల్డప్.. బన్నీ అలా అనొచ్చా అంటూ ఘాటుగా!Pushpa మూవీపై గరికపాటి సంచలన వ్యాఖ్యలు: వాడు హీరోలా బిల్డప్.. బన్నీ అలా అనొచ్చా అంటూ ఘాటుగా!

    క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న 'హరిహర వీరమల్లు' మూవీ కోసం బాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ శామ్ కౌశల్ రంగంలోకి దిగారు. ఈ మేరకు ఆయన క్రిష్ జాగర్లమూడితో దిగిన ఫొటోను ట్విట్టర్‌ ఖాతాలో షేర్ చేశాడు. అలాగే, 'పవన్ కల్యాణ్ సార్‌తో చేస్తున్న హరిహర వీరమల్లు యాక్షన్ షెడ్యూల్ కోసం ఎంతో మంచి మనిషి, క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ గారితో చర్చలు జరుపుతున్నాం. మా సినిమాపై దేవుడి ఆశీస్సులు ఉంటాయని అనుకుంటున్నాను' అని ట్వీట్ చేశాడు. ఇదిలా ఉండగా.. శామ్ కౌశల్ 'ధూమ్ 3', 'భాజీరావ్ మస్తానీ', 'దంగల్' వంటి చిత్రాలకు పని చేశాడు.

    Krish Met Sham Kaushal for Harihara Veeramallu

    పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు' సినిమాలో పవన్ కల్యాణ్ వజ్రాల దొంగలా నటిస్తాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. దీని కోసం అతడు గుర్రపు స్వారీ, కత్తిసాము, కర్రసాము సహా ఎన్నో విద్యలను నేర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఈ మూవీకి భారీ స్థాయిలో రూ. 180 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. కోహినూర్ డైమండ్ చుట్టూ తిరిగే ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

    English summary
    Power Star Pawan Kalyan Now Doing Harihara Veeramallu under Krish direction. Now Director Met Sham Kaushal for Action Episodes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X