క్రిష్ మామూలోడు కాదు.. పవన్ ఇచ్చిన గ్యాప్ లో రెండో సినిమా కూడా..
గమ్యం, వేదం అంటూ మొదటి రెండు సినిమాలతోనే తన టాలెంట్ ఏమిటో చూపించాడు దర్శకుడు క్రిష్. ఆడియెన్స్ మనసుకు హత్తుకునేలా సినిమాలు తెరకెక్కించే క్రిష్ ప్రేక్షకుల్లో ఒక గౌరవాన్ని సంపాదించుకున్నాడు. ఎదో ఒక మంచి పాయింట్ తో నిత్యం ఆలోచింపజేసే విధంగా చేసే ఈ విలక్షణ దర్శకుడు కథ సెట్టయితే చాలు.. చాలా వేగంగా షూటింగ్ పూర్తి చేస్తాడు. ఇప్పటికే వైష్ణవ్ తేజ్ తో 40రోజుల్లో ఒక సినిమాను ఫినిష్ చేశాడు.
అసలైతే క్రిష్ మొదట పవన్ కళ్యాణ్ తో ఒక పిరియాడిక్ సినిమాను ప్లాన్ చేసుకున్న విషయం తెలిసిందే. కానీ లాక్ డౌన్ కారణంగా ఒక్కసారిగా ఆ సినిమా షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది. పవన్ కళ్యాణ్ ప్లాన్స్ కూడా చేంజ్ అయ్యాయి. ముందుగా వకీల్ సాబ్ సినిమాను పూర్తి చేసి ఆ తరువాత అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాను పూర్తి చేయాలని డిసైడ్ అయిన విషయం తెలిసిందే. ఇక పవన్ ఇప్పట్లో దొరికేలా లేడని మరో రెండు నెలలు గ్యాప్ వస్తుండడంతో క్రిష్ మరో మినీ ప్రాజెక్టును లైన్ లో పెట్టె ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఒక ప్రముఖ రచయిత రాసిన నవల ఆధారంగా స్క్రిప్ట్ రెడీ చేసుకున్న క్రిష్ దాన్ని 35రోజుల్లో షూటింగ్ పూర్తి చేసేలా ఒక ప్లాన్ రెడీ చేసుకోవాలని కొత్తగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ రోజుల్లో అంత స్పీడ్ గా సినిమాను పూర్తి చేయాలి అంటే నిజంగా చాలా కష్టమైన పని. కానీ క్రిష్ ప్లాన్ వేశాడు అంటే అంత ఈజీగా లేటవ్వద్దు. త్వరలోనే పవన్ తో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సింగిల్ డేలో నటీనటులపై కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











