దర్శకుడిగా సూపర్ స్టార్ కృష్ణ.. 76లో కూడా అదే దూకుడు!

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చినా సినీ పరిశ్రమతో ఆయనకున్న సంబంధం ఎప్పటికి తొలగలేదు. ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో జరిగే సమావేశాలపై ఆయన పాల్గొంటూనే ఉంటారు. ఇప్పుడున్న సీనియర్ మోస్ట్ యాక్టర్స్ లో ఒకరైన కృష్ణ అంటే నేటితరం నటులకు ఎంతో గౌరవం. ఇక కొడుకు మహేష్ సినిమాల ఈవెంట్స్ కి కూడా ఒకప్పుడున్న ఎనర్జీతోనే వస్తుంటారు. అభిమానులకు అభివాదాలు తెలుపుతూ ఇతర హీరోలకు కూడా అప్పుడప్పుడు బెస్ట్ విషెస్ ని అందిస్తూ ఉంటారు.

ఒకప్పుడు కృష్ణ గారి స్పీడ్ ని అందుకోవడం మిగతా హీరోలకు చాలా కష్టంగా ఉండేది. ఒకే ఏడాది పదుల సంఖ్యలో షూటింగ్ లలో పాల్గొంటూ అత్యదిక సినిమాలను రిలీజ్ చేసేవారు. డిఫరెంట్ కాన్సెప్ట్ లకు ఒక ట్రెండ్ సెట్ చేసిన బెస్ట్ యాక్టర్ అని చెప్పవచ్చు. డైరెక్టర్ కూడా పలు సినిమాలను తెరకెక్కించిన అనుభవం ఉంది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. కృష్ణ చాలా కాలం తరువాత దర్శకుడిగా యాక్షన్ చెప్పారట. 76 ఏళ్ల వయసులో కూడా అదే ఎనర్జితో వర్క్ చేయడానికి దూకుడుగా వెళ్లారట.

Krishna has directed a scene from his grandson ongoing debut film

ఆయన మనవాడు అశోక్ గల్లా హీరోగా పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా కోసం ఒక సీన్ ని కృష గారే ఎంతో ఇష్టంగా డైరెక్ట్ చేసిన్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ కారణంగా మూవీ షెడ్యూల్ ని మార్చేసిన చిత్ర యూనిట్ వీలైనంత త్వరగా షూటింగ్ ని మళ్ళీ ట్రాక్ లో పెట్టాలని ప్రయత్నాలు చేస్తోంది. అనుకున్నట్లు జరిగితే ఇదే ఏడాది ఫాస్ట్ గా సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X