‘రుద్రాక్ష’ మూవీ రూమర్లపై స్పందించిన కృష్ణ వంశీ
గులాబి, నిన్నే పెళ్లాడుతా, సింధూరం, అంత:పురం, మురారి, ఖడ్గం, చందమామ లాంటి అవార్డ్ విన్నింగ్, సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ వంశీ వరుస ప్లాపుల కారణంగా సినిమాలు చేయడం తగ్గించేశాడు. ఆయన చివరగా దర్శకత్వం వహించిన 'నక్షత్రం' కూడా బాక్సాఫీసు వద్ద ఫెయిలైంది.
త్వరలో కృష్ణ వంశీ 'రుద్రాక్ష' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకి బండ్ల గణేశ్ నిర్మాతగా వ్యవహరించనున్నట్టు రూమర్స్ హల్ చల్ చేశాయి. ఇది హీరోయిన్ సెంట్రిక్ సబ్జెక్ట్ అని, ఇందులో ఓ స్టార్ హీరోయిన్ ప్రధాన పాత్రలో నటించబోతున్నట్లు కొన్ని వెబ్ సైట్లలో వార్తలు సైతం దర్శనమిచ్చాయి.

ఈ న్యూస్ కృష్ణ వంశీ వరకు వెళ్లడంతో 'రుద్రాక్ష' పై స్పందించారు. తాను ఈ టైటిల్‌తో సినిమా చేయనున్నట్టుగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఏదైనా సినిమా మొదలుపెడితే అధికారికంగా ప్రకటిస్తానని చెప్పిట్లు సమాచారం.
కాగా... కృష్ణ వంశీ ఫ్యాన్స్ తమ అభిమాన దర్శకుడి నుంచి సినిమా రావాలని బలంగా కోరుకుంటున్నారు. ట్విట్టర్ ద్వారా ఆయనకు సందేశాలు పంపుతూనే ఉన్నారు. మీ సినిమా కోసం ఎదురు చూస్తున్నాం అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.
2009లో వచ్చిన 'మహాత్మ' మూవీ వరకు కృష్ణ వంశీ లీడింగులో ఉన్నారు. అయితే 2011లో వచ్చిన 'మొగుడు' పరాజయం పాలవ్వడం, 2014లో వచ్చిన 'పైసా' మూవీ కూడా ఆశించిన స్థాయిలో ఆడక పోవడంతో వెనక పడిపోయారు. 2014లో రామ్ చరణ్‌తో 'గోవిందుడు అందరి వాడేలే', 2017లో వచ్చిన 'నక్షత్రం' ప్లాప్ అవ్వడంతో ఆయన కెరీర్ పరంగా మరింత వెక్కి వెళ్లారు.


Click it and Unblock the Notifications











