కృష్ణవంశీ మరో ప్రయోగం.. అరిటాకులో నెత్తుటి కొడవలి, తాళి.. పోస్టర్ తోనే షాక్ ఇచ్చాడు!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ప్రయోగాలతో అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఆలోచింపజేసేలా సినిమాలు చేసిన దర్శకుడు కృష్ణవంశీ. గులాబీ నుంచి ఆయన ప్రతి సినిమా కూడా ఒక యూనిక్ స్టైల్ తో వచ్చినవే. ఫ్యామిలీ కథలు, ఆలోచింపజేసే సందేశాత్మక సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకున్నాయి. అయితే నెక్స్ట్ ఆయన మరిన్ని డిఫరెంట్ సినిమాలతో రాబోతున్నారు.

ఆ సినిమా తరువాత సక్సెస్ లేదు
కృష్ణవంశీ దాదాపు అన్ని రకాల జానర్స్ ను టచ్ చేశారు. ఎలాంటి కాన్సెప్ట్ తీసుకున్నా కూడా తనదైన శైలిలో సినిమాలను తెరకెక్కిస్తూ వస్తున్నారు. అయితే చందమామ సినిమా తరువాత మళ్ళీ ఆయన సరైన సక్సెస్ అందుకోలేదు. ఆ సినిమా తరువాత చేసిన ఆరు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్ లో క్లిక్కవ్వలేదు.

నెక్స్ట్ రంగమార్తాండ
కృష్ణవంశీ చివరగా చేసిన సినిమా నక్షత్రం. 2007లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా కూడా ప్లాప్ అయ్యింది. ఇక నెక్స్ట్ ఎలాగైనా మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఒక మరాఠీ కథను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. రంగమార్తాండ అనే ఆ సినిమాలో రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

అన్నం.. పరబ్రహ్మ స్వరూపం
ఇక ఆ సినిమా విడుదల కాకముందే మరొక సినిమాపై క్లారిటీ ఇచ్చేశారు. సామాజిక అంశాల ఆధారంగానే ఆ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే టైటిల్ ని సెట్ చేసిన కృష్ణవంశీ పోస్టర్ లో అరిటాకులో నెత్తుటి కొడవలిని, తాళిని కూడా చూపించాడు. చూస్తూంటే బలమైన సందేశం ఇచ్చేలా ఉన్నారని అనిపిస్తోంది.

బాలకృష్ణకు చెప్పిన కథేనా..?
సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్లు చెప్పారు. అయితే గతంలో కృష్ణవంశీ రైతు అనే సినిమాను చేయాలని స్క్రిప్ట్ రెడీ చేసుకొని బాలకృష్ణ వంటి అగ్ర హీరోల దగ్గరకు వెళ్ళాడు. కానీ సినిమా ఎందుకో వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు అదే కాన్సెప్ట్ ను అన్నం అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ఎలాంటి నటీనటులు నటిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











