భార్య రమ్యకృష్ణను తెరపైకి తెస్తూ.. అసలు విషయం చెప్పిన కృష్ణవంశీ
రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా, క్రియేటివ్ డైరెక్టర్‌గా టాలీవుడ్ ఆడియన్స్‌ని ఆకట్టుకున్న కృష్ణవంశీ మరో సినిమాను ప్రకటించారు. సింధూరం, నిన్నే పెళ్ళాడతా, అంతః పురం, మురారి, ఖడ్గం లాంటి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన కృష్ణవంశీ.. గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నారు. సరిగ్గా ఈ తరుణంలో భార్య రమ్యకృష్ణను రంగం లోకి దించుతూ కొత్త సినిమా ప్రకటించారు కృష్ణవంశీ.
నటసామ్రాట్ అనే మరాఠీ సూపర్ హిట్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు కృష్ణవంశీ. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. కృష్ణవంశీ సతీమణి రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ సరసన నటిస్తోంది. తాజాగా సినిమాకు 'రంగమార్తాండ' అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ టైటిల్ లుక్ రిలీజ్ చేశారు ఈ క్రియేటివ్ డైరెక్టర్.

నటసామ్రాట్ అనే ఒరిజినల్ వెర్షన్‌లో నానా పటేకర్ పోషించిన పాత్రను 'రంగమార్తాండ' లో ప్రకాష్ రాజ్ చేస్తున్నారు. దాదాపు 20 సంవత్సరాల తరువాత తన సతీమణి రమ్యకృష్ణను కృష్ణవంశీ డైరెక్ట్ చేయబోతుండటం విశేషం. ఈ సినిమాకు అభిషేక్ అండ్ మధు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. చూడాలి మరి భార్య సహకారంతో కృష్ణవంశీ మరోసారి హాట్ సాధిస్తారా? అనేది.
ఇక మరోవైపు పూరి జగన్నాథ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ సినిమాలోనూ నటిస్తోంది రమ్యకృష్ణ. నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాశ్ పూరి హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పై బిజీగా బిజీగా ఉంది రమ్యకృష్ణ.


Click it and Unblock the Notifications











