Radhe shyam: ఆ పాత్ర కనిపించకపోవడంతో ఫ్యాన్స్ షాక్.. చివరి క్షణంలో లేపేశారుగా..

వరుస యాక్షన్ సినిమాల అనంతరం నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేసిన లవ్ అడ్వెంచర్ మూవీ రాధే శ్యామ్ నేడు విడుదలైన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన ఈ సినిమను చూసేందుకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అడ్వాన్స్ బూకింగ్స్ తోనే భారీ స్థాయిలో రికార్డులను బ్రేక్ చేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించి మొదటి షో చూసిన ఓవర్సీస్ ప్రేక్షకులు ఒక విధంగా ఆశ్చర్యపోయారు. అతి ముఖ్యమైన క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో చిత్ర యూనిట్ ని ప్రశ్నిస్తున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే..

 మొదటి రోజు కలెక్షన్స్

మొదటి రోజు కలెక్షన్స్

రాధే శ్యామ్ సినిమా గత ఏడాది నుంచి ప్రేక్షకులను ఏ స్థాయిలో ఊరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇక మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుంది అనేది అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. దాదాపు 7 వేలకు పైగా థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా మొదటి రోజు 30 నుంచి 50 కోట్ల మధ్యలో కలెక్షన్స్ అందుకోవచ్చని సమాచారం.

ఓవర్సీస్ లో భారీగా

ఓవర్సీస్ లో భారీగా

ఓవర్సీస్ లో కూడా రాధే శ్యామ్ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేశారు. ఇక అడ్వాన్స్ బూకింగ్స్ తోనే సినిమా హైదరాబాద్ లో 4కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్నట్లు సమాచారం. ఇక మొదటిరోజు యూఎస్ ప్రీమియర్స్ తో కలుపుకొని రాధే శ్యామ్ 1 మిలియన్ డాలర్లను అందుకోవడం కాయమని చెబుతున్నారు.

ఒకటి మిస్ అయ్యింది

ఒకటి మిస్ అయ్యింది


ఇక రాధే శ్యామ్ సినిమాకు ప్రస్తుతం క్రిటిక్స్ నుంచి విభిన్నంగా టాక్ వస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరొక ఆసక్తికరమైన అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాను ఓవర్సీస్ లో వీక్షించిన ఆడియెన్స్ ఒకటి మిస్ అయ్యిందని అంటున్నారు. యూఎస్ లోనే కాకుండా దుబాయ్ లో కూడా అదే జరిగిందని చెబుతున్నారు.

 ఆ పాత్ర లేకపోవడంతో..

ఆ పాత్ర లేకపోవడంతో..


సినిమాలో పరమహంస పాత్రలో నటించిన కృష్ణంరాజు పాత్రను యూఎస్ ఆడియెన్స్ చూడలేదట. అక్కడ ప్రింట్స్ లలో ఆ పాత్రను ఆఖరి నిమిషంలో తీసేసినట్లుగా టాక్ వస్తోంది. దుబాయ్ లో ప్రదర్శించిన షోలతో కూడా కృష్ణంరాజు పాత్ర లేదని అంటున్నారు. ఎందుకు కృష్ణంరాజు పాత్రను తీసేశారు అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది.కృష్ణంరాజు పాత్రను కేవలం తెలుగులో ఉంచగా మిగతా భాషల్లో సత్యారాజ్ ను ఉంచారు. ఇక యూఎస్ తెలుగు ప్రింట్స్ లో మాత్రం తెలుగులో సత్యారాజ్ పాత్రను జత చేశారు. ఇలా ఎందుకు జరిగిందనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న.

Recommended Video

Radhe Shyam Review ప్రభాస్ ఫాన్స్ జెన్యూన్ రివ్యూ .. | Prabhas | Pooja Hegde| Filmibeat Telugu
టాక్ ఎలా ఉందంటే?

టాక్ ఎలా ఉందంటే?


ఇక సినిమాకు సంబంధించిన టాక్ విషయానికి వస్తే సినిమా అభిమానుల అంచనాలను అందుకోలేదు అనే టాక్ అయితే ఎక్కువగా వస్తోంది. క్యూట్ కప్ స్టోరీగా అయితే బాగుందని కానీ మాస్ సినిమాలను చూసే వారికి సినిమా ఎంతవరకు నచ్చుతుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. మరి సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో వసూళ్లను అందుకుంటుందో చూడాలి.
ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లో అయితే ప్రభాస్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. గత రెండు వారాలుగా గ్యాప్ లేకుండా అన్ని భాషల్లోనూ వీలైనంత ఎక్కువగా ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు తప్పకుండా ఈ సినిమాతో ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని ప్రభాస్ కోరుకుంటున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X