Krishnam Raju తీయాలనుకున్న బిగ్ బడ్జెట్ సినిమాలు.. ముఖ్యంగా ప్రభాస్ తో బిగ్ ప్లాన్!

తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి నటుడిగా మంచి మనసున్న వ్యక్తిగా గుర్తింపున అందుకున్న అతికొద్ది మందిలో కృష్ణంరాజు ఒకరు. కేవలం ఒక నటుడిగానే కాకుండా ఆయన ప్రజాసేవలో కూడా పలు కార్యక్రమాలతో రాజకీయ నాయకుడిగా మంచి గుర్తింపు అందుకున్నారు. కృష్ణంరాజు మరణ వార్త గురించి తెలియగానే కేవలం సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా ఆయన అభిమానులు కూడా తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.

రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న కృష్ణంరాజు 8 పదుల వయసు వచ్చిన కూడా ఇంకా నటుడుగానే కొనసాగాలని అనుకున్నారు. చివరగా ప్రభాస్ తో రాధే శ్యామ్ సినిమాలో ఒక గురువు పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. అయితే కృష్ణంరాజు బలంగా కోరుకున్న వాటిలో ప్రభాస్ పెళ్లి మాత్రమే కాదు కొన్ని డ్రీమ్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ప్రభాస్ తో చాలా సార్లు అతని పెళ్లి గురించి మాట్లాడినప్పటికీ కూడా వివిధ కారణాల వలన అది అది వాయిదా పాడుతూ వస్తుంది.

Krishnam raju dream projects and Unfulfilled Wishes

అయితే సినిమాల విషయంలో మాత్రం కృష్ణంరాజు కొన్ని బలమైన ప్రాజెక్టులు పూర్తి చేయాలని అని కూడా ఒక గోల్ పెట్టుకున్నారు. ముఖ్యంగా అందులో భక్తకన్నప్ప కథను కేవలం ప్రభాస్ తోనే తెరపైకి తీసుకురావాలి అని ఆయన ప్లాన్ కూడా వేసుకున్నారు. అలాగే కృష్ణంరాజు కెరీర్ లో బిగ్ హిట్ గా నిలిచిన సినిమాలలో మన ఊరి పాండవులు ఒకటి. ఆ సినిమాను కూడా ప్రభాస్ తో పాటు మరి కొంతమంది యువ హీరోలతో మళ్లీ సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు.

కానీ ప్రభాస్ బిగ్ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉండడం వలన కృష్ణంరాజు ప్రాజెక్టులను మొదలుపెట్టలేకపోయాడు. అంతేకాకుండా ఇతర నటీనటులతో విశాల నేత్రాలు అనే ఒక నవల ఆధారంగా కూడా కృష్ణంరాజు సినిమాను నిర్మించాలని అనుకున్నారు. అయితే ఇవన్నీ అనుకుంటున్న సమయంలోనే ఆయనకు వివిధ అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయి. దీంతో వేటిపైన బలమైన ఫోకస్ పెట్టలేకపోయారు. గత ఏడాది వరకు ప్రభాస్ పెళ్లి చూడాలి అని బలంగా కోరుకున్న కృష్ణంరాజు కోరిక నెరవేరలేదు. అలాగే గవర్నర్ గా కూడా చేయాలని అనుకున్నారు. ఈ కోరికలు నెరవేరకముందే కృష్ణంరాజు కన్నుమూశారు. ఇక ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X