‘రాధే శ్యామ్’ షూటింగ్‌పై లేటెస్ట్ అప్‌డేట్: పూజా హెగ్డే వెళ్లింది.. ఆయన వచ్చాడు

ఇంత కాలం తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపించి.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా ఎదిగిపోయిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'రాధే శ్యామ్'. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ప్యూర్ లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తైంది. ఇక, ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన బ్యాలెన్స్ వర్క్ కోసం పది రోజుల ఫైనల్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. తాజాగా ఈ చిత్రీకరణ గురించిన కొన్ని కీలకమైన విషయాలు ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.

ప్రస్తుతం జరుగుతోన్న 'రాధే శ్యామ్' చివరి షెడ్యూల్‌లో పూజా హెగ్డేపై తీయాల్సిన సన్నివేశాలను మొదటి నాలుగు రోజుల్లోనే పూర్తి చేసేశారట. దీంతో ఆమె ఇళయదళపతి విజయ్‌తో చేసే సినిమా కోసం చెన్నై చెక్కేసింది. ఇక, ఇప్పుడు రెబెల్ స్టార్ కృష్ణంరాజు.. చిత్ర హీరో ప్రభాస్ మధ్య కొన్ని ఎమోషనల్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ చేస్తోన్న ఈ మూవీ షూటింగ్ మరో రెండు మూడు రోజుల్లో కంప్లీట్ కాబోతుందట. అప్పటి వరకూ కృష్ణంరాజు చిత్రీకరణలో పాల్గొంటారని తెలుస్తోంది. ఇక, ఇందులోనే ప్రభాస్‌పై గ్రీన్ మ్యాట్ సీన్స్ తీస్తారని టాక్.

Krishnam Raju Entry to Prabhass Radhe Shyam Final Schedule

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'రాధే శ్యామ్' మూవీలో ప్రభాస్ కార్ల దొంగగా నటిస్తున్నాడని తెలుస్తోంది. 1960 దశకం నాటి కథతో రూపొందుతోన్న ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకూ విడుదలైన అన్ని పోస్టర్లు, టీజర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ లభించింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక, ఈ సినిమాను కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోంది. ఇది తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X