దటీజ్ డార్లింగ్ ఫ్యామిలీ.. పనిమనిషిని ఇలా ఎవరైనా ట్రీట్ చేస్తారా? వైరల్ అవుతున్న ఫోటోలు!
సినిమా వాళ్ళలో ప్రభాస్ ను మర్యాద కు మారుపేరుగా చెబుతారు. ఆయనతో పాటు పనిచేసే కో స్టార్స్ మొదలు మిగతా అందరితో కూడా చాలా మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారు అని అందరూ చెబుతుంటారు. మరీ ముఖ్యంగా ప్రభాస్ తిండి విషయంలో చాలా కేర్ తీసుకుంటారు అని కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడు తమ ఇంట్లో పనిమనిషి విషయంలో ప్రభాస్ కుటుంబం తీసుకున్న కేర్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళితే తాజాగా రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇంట్లో గత 25 ఏళ్లుగా పనిచేస్తున్న పద్మ అనే మహిళను కృష్ణంరాజు కుటుంబం ఘనంగా సన్మానించారు. 25 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అంటూ ఆమెతో కేక్ కట్ చేసి మరీ సెలబ్రేట్ చేసుకున్నారు.
దీనికి సంబంధించిన ఫోటోలను కృష్ణంరాజు-శ్యామల కుమార్తె నిర్మాత ప్రసీద సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమె 25 ఏళ్లుగా మా కోసం చాలా చేశారని ప్రసీద పేర్కొన్నారు. థాంక్యూ పద్మ ఆంటీ అంటూ ప్రసీద తఙ్ఞతలు తెలిపారు. ఇక కేక్ కట్ చేయడమే కాకుండా ఈ సందర్భంగా కృష్ణం రాజు సతీమణి శ్యామలా దేవి ఆమెకు ఓ బంగారు గొలుసును కూడా కానుకగా ఇచ్చినట్లు ప్రధారం జరుగుతోంది. అయితే ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలను ప్రసీద తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చేయడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఇంట్లో పనిచేసే మహిళను కూడా ఇంట్లో మనిషిగా చేసుకోవడం నిజంగా గ్రేట్ అంటూ కృష్ణంరాజు దంపతుల మీదనే కాక డార్లింగ్ ఫ్యామిలీ మీదనెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాను వంశీ, ప్రమోద్‌లతో కలిసి ప్రసీద గోపీ కృష్ణ మూవీస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. వారితో కలిసి ప్రసీద అన్ని నిర్మాణ కార్యక్రమంలో భాగం అవుతూ ముందుకు వెళ్తున్నారు. ఇక ఎప్పటికప్పుడు ప్రసీద తనకు సంబంధించిన అన్ని విషయాలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటారు. ఇక ఆ మధ్య ప్రసీద లంబోర్గిని అవెంటాడర్ ఎస్ రోడ్‌స్టర్ అనే ప్రభాస్ కు చెందిన లగ్జరీ కారులో షికార్లు కొట్టింది. దీని తాలూకు వీడియోను స్వయంగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామల సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో అప్పట్లో ఆ వీడియో నెట్టింట్‌లో వైరల్‌గా మారింది ఇక ప్రసీద ప్రస్తుతం అమెరికాలో ఫిల్మ్‌మేకింగ్ నేర్చుకుంటోంది.


Click it and Unblock the Notifications











