ఆమెకు తీరని చిరకాల కోరిక.. ప్రభాస్ తీరుస్తాడా?
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 ఏడీ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన నెక్స్ట్ మూవీ గురించి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చర్చ నడుస్తోంది. ప్రభాస్ పెద్దమ్మ, సీనియర్ రెబల్ స్టార్ కృష్ణం రాజు భార్య శ్యామలా దేవి తాజాగా ఓ సెన్సేషనల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. శ్యామల దేవి ప్రకటన ప్రకారం ఆమె డ్రీమ్ ప్రాజెక్ట్, కృష్ణంరాజు తీరని కోరికను ప్రభాస్ తీరుస్తాడా? అనే విషయంపై ఓ లుకేద్దాం.
ప్రభాస్ కల్కి థియేటర్లలో ఇంకా దూకుడు చూపిస్తుంటే, కలెక్షన్ల జోరు తగ్గకుండా తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను డిస్కస్ చేస్తూనే, అభిమానుల ప్రశ్నలకు కూడా సమాధానాలు చెబుతున్నారు. ఇప్పటికే కల్కి మూవీ 700 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. తాజాగా కాస్త కలెక్షన్ల జోరు తగ్గడంతో ఈ మూవీ 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందా లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు ప్రభాస్ నెక్స్ట్ మూవీ ఇదేనంటూ రోజుకో వార్త ప్రచారం అవుతోంది. సలార్ 2 షూటింగ్ ను స్టార్ట్ చేస్తాడు అని కొందరు అంటుంటే, మరోవైపు అదేమీ లేదు ప్రస్తుతం రాజా సాబ్ షూటింగ్ లో ఆయన బిజీ కాబోతున్నాడు అంటూ మరికొంత మంది వాదించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే
ప్రముఖ తెలుగు సినీ నటుడు కృష్ణం రాజు సతీమణి శ్యామలా దేవి ఈరోజు ఒక పెద్ద ప్రకటన చేశారు.
ప్రముఖ తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకల్లో ఈరోజు ఆమె పాల్గొన్నారు. ఈ వేడుకల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన శ్యామలా దేవి ప్రభాస్‌తో అల్లూరి సీతారామరాజు నేపథ్యంలో సినిమా చేయాలనే తన కల గురించి వెల్లడించారు. శ్యామలా దేవి మాట్లాడుతూ "ప్రభాస్ నటిస్తే అల్లూరి సీతారామరాజు మళ్లీ తెరపైకి వస్తాడు. చాలా మంది అభిమానులు ప్రభాస్‌ని అల్లూరిలా చూడాలని కోరుకుంటున్నారు. నేను ప్రభాస్‌కి అభిమానుల కోరికను తెలియజేస్తాను. ప్రాజెక్ట్‌ను తెరపైకి తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను" అని ఆమె చెప్పింది.

శ్యామలా దేవి 15 ఏళ్ల క్రితం పార్లమెంటులో అల్లూరి విగ్రహం ఏర్పాటు కోసం తన భర్త, ప్రముఖ దివంగత నటుడు, రాజకీయవేత్త కృష్ణంరాజు ఎలా ప్రయత్నం చేశారో గుర్తు చేసుకున్నారు. "కృష్ణంరాజు గారు అప్పటి స్పీకర్ మీరా కుమార్‌ని కలిసి అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి కోరారు. కానీ కొన్ని కారణాల వల్ల అతని కోరిక నెరవేరలేదు. మేము ఇప్పుడు విగ్రహం గురించి భారత రాష్ట్రపతి, ప్రధాన మంత్రిని అభ్యర్థిస్తాము" అని ఆమె తెలిపారు.
ఇదిలా ఉండగా ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు వారాసుడిగానే టాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు. మరి ఆయన తీరని కోరికను రెబల్ స్టార్ తీరుస్తాడా? శ్యామలా దేవి డ్రీమ్ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తాడా? అనేది చూడాలి. ఒకవేళ అల్లూరిగా నటించడానికి ప్రభాస్ ఒప్పుకుంటే ఆయన అభిమానులందరికీ తప్పకుండా గొప్ప ట్రీట్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.


Click it and Unblock the Notifications











