రాధేశ్యామ్ లో కృష్ణంరాజు స్పెషల్ క్యారెక్టర్.. ఫొటో వైరల్.. మళ్ళీ ఇన్నాళ్లకు..
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో రాధేశ్యామ్ టాప్ లిస్టులో ఉంది అనే చెప్పాలి. ఈ సినిమా గత రెండేళ్ల నుంచి అభిమానులను ఎంతగానో ఉరిస్తోంది. సాహో సినిమాతో పాటు ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా షూటింగ్ కూడా ఒకేసారి మొదలు పెట్టాడు. కానీ అనుకోని కారణాల వలన సినిమాకు చాలాసార్లు బ్రేకులు పడుతూ వచ్చాయి. ఏది ఏమైనా కూడా మొత్తానికి ఈ సంక్రాంతికి రాధేశ్యామ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. అయితే నేడు ఆయన పాత్రకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

రెబల్ సినిమా తరువాత..
చాలా రోజుల తర్వాత రెబల్ స్టార్ వెండి తెరపై కనిపించడానికి సిద్ధంగా ఉండటంతో అభిమానుల్లో కూడా చాలా ఆసక్తి నెలకొంది. ఇక కృష్ణంరాజు చివరగా ప్రభాస్ తో రెబల్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక మళ్లీ ఇన్నాళ్లకు రాధేశ్యామ్ సినిమా ద్వారా తన పెదనాన్న తో కలిసి ప్రభాస్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.. అభిమానుల్లో ఈ కాంబినేషన్ పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

చివరగా ఆ సినిమాలో..
కృష్ణంరాజు చాలా కాలంగా సెలెక్టివ్ గా సినిమాలను చేసుకుంటూ వస్తున్నారు. తనకు నచ్చిన పాత్రలను మాత్రమే చేస్తున్నారు. చివరగా కృష్ణంరాజు అనుష్క శెట్టి రుద్రమదేవి సినిమాలో గణపతి దేవుడు పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. మళ్లీ ఆ తర్వాత ఆయనకు చాలా పాత్రలో చేసే ఆఫర్స్ వచ్చినప్పటికీ పలు ఆరోగ్య కారణాల వల్ల కూడా పెద్దగా ఆసక్తి చూపలేకపోయారు. ఇక 7 ఏళ్ళ అనంతరం రాధేశ్యామ్ సినిమాతో వెండితెరపై కనిపించబోతున్నారు.

ఆధ్యాత్మిక గురువుగా
ఇక మళ్లీ చాలా కాలం తర్వాత 81 ఏళ్ళ వయసులో కృష్ణంరాజు ప్రభాస్ సినిమాలో వయసుకు తగ్గట్టుగా ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. రాధేశ్యామ్ సినిమాలో కృష్ణంరాజు ఆధ్యాత్మిక గురువుగా పరమహంస అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయనకు సంబంధించిన సన్నివేశాలు సినిమాలో చాలా కీలకం కానున్నాయని కథను మలుపు తిప్పే సన్నివేశాలలో కూడా ఆ పాత్రే చాలా కీలకంగా అని తెలుస్తోంది.

సంక్రాంతి రిలీజ్..
ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడని ఇప్పటికే చిత్ర యూనిట్ నుంచి ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా అభిమానుల్లో అంచనాలు స్థాయిని మరింత పెంచేసింది. సినిమాను తప్పకుండా జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో పోటీ ఉన్నప్పటికీ కూడా రాధేశ్యామ్ సినిమా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది.

వచ్చే ఏడాది మూడు సినిమాలు
ఇక ప్రభాస్ రాదేశ్యామ్ సినిమా అనంతరం సలార్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఆదిపురుష్ సినిమా కూడా భారీ స్థాయిలో తెరపైకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది చివర్లో రానున్నట్లు తెలుస్తోంది. కుదిరితే వచ్చే ఏడాది ప్రభాస్ మూడు సినిమాలతో అభిమానులకు మంచి కిక్ ఇచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











