For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఉన్న గౌరవాన్ని నిలబెడితే చాలు.. జీవిత, రాజశేఖర్, నరేష్‌కు కృష్ణం రాజు సలహా

  |

  మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) డైరీ 2020 ఆవిష్కరణ కార్యక్రమం నేడు హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ కృష్ణం రాజు, మోహన్ బాబు, మురళీ మోహన్ వంటి ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ మధ్య మాలో వచ్చిన మనస్పర్థలు, విభేదాలను దృష్టిలో ఉంచుకుని ఈ వేడుకలో వాటన్నంటికి పుల్ స్టాప్ పెట్టాలని సూచించినట్టుగా కృష్ణం రాజు ప్రసంగించారు. పూర్తి ప్రసంగం ఆయన మాటల్లోనే..

  మద్రాస్‌లో అలా..

  మద్రాస్‌లో అలా..


  ‘మా డైరీ ఆవిష్కరణకు ఇంత మంది పెద్దలు తమ సమయాన్ని వెచ్చించి ఇక్కడకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా అని ఎవరు పెట్టారో..అది మనసులోంచి వచ్చింది కాదు ఎక్కడి నుంచి వచ్చింది. మద్రాస్‌లో ఉన్న సమయంలో ప్రభాకర్, గుమ్మడి, జగ్గయ్య, కృష్ణ, నేను ఇలా అందరం కలిసి తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ అని పెట్టాం.

  గారు అనే స్టేజ్‌కు2

  గారు అనే స్టేజ్‌కు2

  దివిసీమలో పెద్ద సునామీ వచ్చినప్పుడు ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. శవాల మధ్య నుంచి బస్సులు వేసుకుని తిరుగుతూ అక్కడి వారందిరినీ పలకరించారు. అందర్నీ ఆదరించాము. సినిమా వాళ్లంటే ఇంత మంచి వారా? అని అందరూ అనుకున్నారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారు, కృష్ణం రాజు గారు అంటూ గార్లు పెట్టి పిలిచే స్టేజ్‌కు వచ్చారు.

   తల్లి ఒడికి..

  తల్లి ఒడికి..

  ఎలాంటి విపత్తులు వచ్చిన తెలుగు చిత్ర సీమ ముందుండి ఆదుకుంటూ ఉంటోంది. వాటి కోసమే ట్రస్ట్ ఏర్పాటు చేశాము. అక్కడి నుంచి హైద్రాబాద్‌కు అంటే తల్లి ఒడికి వస్తోందని ‘మా' అని పెట్టారు. దీనికి ఫౌండర్ ప్రెసిడెంట్.. మావాడు చిరంజీవికి అభినందనలు. ఇలాగే అందరూ దీని గౌరవాన్ని కాపాడాలని, నేను నా అనుకోకుండా.. మా మా మా అని అదే మన అనుకోవాలి, కలిసి పని చేయాలి.

  నిలబెట్టింది చాలు..

  నిలబెట్టింది చాలు..

  తెలుగు చిత్ర సీమకు ఉన్న గౌరవం చాలు.. టాలీవుడ్ అంటే బాలీవుడ్ కంగారు పడుతోంది.. హాలీవుడ్ కూడా దృష్టి పెడుతోంది.. బాహుబలి, సాహో, సైరాలతో ప్రపంచం మనవైపు చూస్తోంది.. ఇలాంటి ప్రతీ చిన్న విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అందరూ మనవైపే చూస్తుంటారు.. ఇంతవరకు నిలబెట్టిన గౌరవం చాలు.. ఇంకా పెద్ద గౌరవం తీసుకురానక్కర్లేదు.. ఉన్న గౌరవాన్ని నిలబెడితే చాలు.

  పెద్ద సమస్యలైతే రండి..

  పెద్ద సమస్యలైతే రండి..

  మాకు ఏం సాయం చేయాలో మేం అందరం చేస్తాం.. చిరంజీవి అమెరికా వెళ్లి కోటి రూపాయల ఫండ్‌ను కలెక్ట్ చేశాడు. యంగ్ హీరోలు కూడా ముందుకు వస్తారు.. నిర్మాతలకు, ఆర్టిస్ట్‌లకు, టెక్నీషియన్స్‌కు గొడవలు వస్తే పరిష్కరించుకోవడానికి తామంతా కలిసి కో ఆర్డినేషన్ కమిటీ అని పెట్టాం. జీవితా, నరేష్, రాజ్ శేఖర్ మీకే చెబుతున్నా.. సమస్యలనేవీ ఎవరికైనా వస్తాయి.. చిన్న సమస్యలుంటే మీలో మీరే పరిష్కరించుకోండి.. పెద్దవైతే మా లాంటి వాళ్ల దగ్గరకు రండి.. అన్ని సమస్యలను సామరస్యకంగా పరిష్కరించుకుంటూ.. గౌరవాన్ని పెంచుకుంటూ ఉండాలని కోరుకుంటున్నా' అని అన్నారు.

  English summary
  Movie Artists Association Dairy Inauguration 2020. Chiranjeevi, KrishnamRaju And MohanBabu Attended This Event. Dairy Is Inagurated By Chiranjeevi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X