Radhe shyam Event: మీతో డ్యాన్స్ చేయాలని ఉంది కాని చేయలేను.. ఈ రెబల్ స్టార్ మరో 50 ఏళ్ళు: కృష్ణంరాజు

యు.వి.క్రియేషన్స్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరపైకి రాబోతున్నారు రాధేశ్యామ్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ప్రభాస్ నుంచి రాబోతున్న ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా పై అంచనాలు అయితే మామూలుగా లేవు. అయితే నేడు చిత్ర యూనిట్ సభ్యులు రామోజీ ఫిలిం సిటీలో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించారు. కృష్ణంరాజు కూడా ప్రత్యేక అతిథిగా వచ్చారు. ఇక ఆయన ఈ సినిమాలో పరమహంస అనే ఒక ఆధ్యాత్మిక గురువు గా కనిపించబోతున్నారు.

 నవీన్ పొలిశెట్టి డామినేట్

నవీన్ పొలిశెట్టి డామినేట్

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ సభ్యులు రామోజీ ఫిలిం సిటీ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు నవీన్ పోలిశెట్టి జబర్దస్త్ యాంకర్ రష్మీ యాంకరింగ్ తో జనాలను ఎంతగానో ఎంటర్టైన్మెంట్ అందించారు. ముఖ్యంగా నవీన్ పోలిశెట్టి చాలా డామినేట్ చేశాడు అనే చెప్పాలి.

కృష్ణం రాజు స్పీచ్..

కృష్ణం రాజు స్పీచ్..

ఈ వేడుకకు హాజరైన కృష్ణంరాజు ఎంతో చలాకీగా మాట్లాడుతూ అభిమానులను పలకరించారు. మాట్లాడుతూ చాలా కాలం తర్వాత మిమ్మల్ని ఈ విధంగా చూస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఎన్నో ఏళ్లుగా మమ్మల్ని మీరు ఆదరిస్తున్నారు. మీ అరుపులు కేకలు వినగానే నేను ఈ వేడుకకు వచ్చేసాను. మీ తో సమానంగా నాకు కూడా డ్యాన్స్ చేయాలని ఎంతో ఆత్రుతగా ఉంది అని చెప్పారు.

 ఒక శిక్ష అనే చెప్పాలి

ఒక శిక్ష అనే చెప్పాలి

అయితే ఈ 50 ఏళ్ల సినీ ప్రయాణంలో ఇలా మిమ్మల్ని చూసినప్పటికీ కూడా నేను ఇలా కుర్చీలో కూర్చుని లేవకుండా ఉండడం ఒక శిక్ష అనే చెప్పాలి. ఈ విధంగా ఒక వారం పది రోజులు ఉంటే సరిపోతుంది మళ్లీ ఎప్పటిలాగానే నేను మీతో కలిసి డాన్స్ చేస్తాను అయితే ఇప్పుడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది కనుక నేను రావాల్సి వచ్చింది.. అని అన్నారు.

ముగ్గురితో డ్యాన్స్ చేస్తా..

ముగ్గురితో డ్యాన్స్ చేస్తా..

రెబల్ స్టార్ ఎప్పుడూ కూడా రెబల్ స్టార్ గానే ఉంటాడు. ఈ రెబల్ స్టార్ ఇంకో 50 సంవత్సరాలు మిమ్మల్ని ఆనంద పరుస్తాడు అని కృష్ణరాజు చెబుతుండగా నవీన్ పోలిశెట్టి మీ నెల సినీ జీవితం లో ఎప్పుడైనా ఎవరైనా ఫ్లట్ చేయడానికి చూశారా అని అడగగానే కృష్ణంరాజు గట్టిగా నవ్వేశారు. అంతేకాకుండా ఇప్పుడు జయసుధ జయప్రద పూజా హెగ్డే ముగ్గురిలో హలో ఎవరితో డాన్స్ చేస్తారు అని అడగగానే ముగ్గురితో చేస్తాను అంటూ కృష్ణంరాజు ఊహించని విధంగా సమాధానమిచ్చారు.

ఫ్యాన్స్ చేత ట్రైలర్ లాంచ్

ఫ్యాన్స్ చేత ట్రైలర్ లాంచ్

ఇక పూజా హెగ్డే తో కాసేపు సరదాగా మాట్లాడిన కృష్ణంరాజు ఆ తర్వాత అభిమానుల చేత ప్రత్యేకంగా ట్రైలర్ ను కూడా చేయించారు.. ట్రైలర్ స్టార్ట్ అయ్యే ముందు అందరితో కూడా మొబైల్ ఫ్లాష్ ఆన్ చేయించారు. చిత్రాన్ని చూసి కృష్ణంరాజు ఎంతగానో సంతోషించారు అంతే కాకుండా అభిమానుల గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడారు. ట్రైలర్ కూడా అద్భుతంగా ఉంది అని సినిమా తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుంది అని తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X