Shyamala Devi: ప్రభాస్ చెప్పిన ఆ స్పెషల్ పర్సన్ కాబోయే భార్యేనా.. క్లారిటీ ఇచ్చిన శ్యామలాదేవి!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈశ్వర్ సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిన ఈయన.. ఛత్రపతి, బాహుబలి, సలార్ వంటి పెద్ద పెద్ద చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 43 ఏళ్ల వయసు కల్గిన ఈయన ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడంతో.. ఇది హాట్ టాపిక్ గా మారింది. ఈయన పెళ్లే చేసుకోరని కొందరు, కాస్త లేటైనా చేసుకుంటారని మరికొందరు ఇలా వితండవాదం చేశారు.
అయితే తాజాగా ప్రభాస్.. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. అందులో డార్లింగ్స్ ఎట్టకేలకు మన జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారంటూ చెప్పుకొచ్చారు. దీంతో అంతా ఆయన పెళ్లి చేసుకోబోతున్నారా.. లేదా ఏదైనా సినిమా గురించి అప్ డేట్ ఇచ్చారా అని పొద్దుటి నుంచి ఆలోచిస్తున్నారు. ఎవరికి నచ్చినట్లు వాళ్లు వార్తలు రాసుకు వస్తున్నారు. అయితే కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి దీనిపై క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా ప్రభాస్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వివరించారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి విషయంలో అనేక వార్తలు వచ్చాయి. ప్రస్తుతం 44 ఏళ్ల వయసు కల్గిన ఈయన అసలు పెళ్లే చేసుకోరని.. అనేక అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారంటూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి కూడా కామెంట్లు చేశారు. అలాగే అనుష్క శెట్టి, ప్రభాస్ లు పెళ్లి చేసుకుంటే విడాకులు కూడా తీసుకుంటారని.. అయినా ప్రభాస్ కు పెళ్లి చేసుకునే ఆలోచనే లేదంటూ కూడా ఆయన వివరించారు. కానీ ఇలాంటి వారందరి నోళ్ల మూయించేలాగా డార్లింగ్ ప్రభాస్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు.
సోషల్ మీడియాలో ఏమాత్రం యాక్టివ్ గా ఉండని ఆయన.. సడెన్ గా ఇలాంటి పోస్ట్ పెట్టడంతో అంతా షాక్ అవుతున్నారు. ముఖ్యంగా ప్రభాస్ " డార్లింగ్స్.. ఎట్టకేలకు మన జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారని.. వెయిట్ చేయండి" అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ పోస్టులో ప్రభాస్ చెప్పిన వ్యక్తి ఎవరు అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. అయితే తాజాగా వీటిపై ఆయన పెద్దమ్మ కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి స్పందించింది.

త్వరలోనే ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడని క్లారిటీ ఇచ్చింది. అయితే పెళ్లి ఎప్పుడు, అమ్మాయి ఎవరు అంటూ యాంకర్ అడగ్గా.. అది చెప్పను కానీ.. ఆ దేవుడి దయ వల్ల మీరంతా త్వరలోనే గుడ్ న్యూస్ వింటారని చెప్పుకొచ్చింది. అలాగే ఈ ఏడాదే ఆయన పెళ్లి ఉంటుందంటూ స్పష్టం చేసింది. పైన ఉన్న కృష్ణంరాజు గారే తమను ముందుకు నడిపిస్తున్నారని.. ముఖ్యంగా ప్రభాస్ ను ఓ ఇంటి వాడిని చేసి అందరికీ గుడ్ న్యూస్ అందించబోతున్నారంటూ కూడా కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ప్రభాస్ పోస్ట్ పెళ్లి గురించేనని, ఆయనకు కాబోయే భార్య గురించి డార్లింగ్ అలా పోస్ట్ పెట్టారంటూ పలువురు వివరిస్తున్నారు. చూడాలి మరి ఏది నిజం కాబోతుందనేది.


Click it and Unblock the Notifications











