Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి ఎప్పుడో చెప్పేసిన శ్యామలదేవి.. అమ్మాయి ఎవరో తెలుసా?
బహుబలి కట్టప్పను ఎందుకు చంపారో... పార్ట్ 2 వచ్చే వరకు సస్పెన్స్ గానే ఉండిపోయింది. ఇప్పుడు ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నకు... ఎన్నో ఏళ్లుగా సమాధానం దొరకలేదు. ఇప్పుడు తాజాగా ఆ ప్రశ్నకు కృష్ణంరాజు భార్య శ్యామలదేవి మొత్తానికి క్లారిటీ ఇచ్చేసింది. ప్రభాస్ పెళ్లిపై తాజాగా శ్యామలదేవి క్లారిటీ ఇచ్చారు. అంతే కాదు పెళ్లి ఎప్పుడు.. ఏంటి అనే వివరాలు మీడియాతో చెప్పుకువచ్చింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభాస్... మొదటి సినిమాతోనే ఎవరీ కుర్రాడు అనేంతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రెండో సినిమా వర్షంతో బాక్సాఫీస్ వద్ద కృష్ణం రాజు వారసుడు వచ్చాడు అని అందరికీ తెలిసేలా చేశాడు. ఇక ఆ సినిమా తర్వాత వెనక్కి చూసుకోలేదు. వరుసగా సినిమాలు చేస్తూ.. స్టార్ హీరో అయిపోయాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో బహుబలి సినిమాలో నటించాక.. పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అనగానే... ముందుగా గుర్తుకు వచ్చేది ప్రభాసే. ఎప్పటి నుంచి అదిగో పెళ్లి... ఇదిగో పెళ్లి అంటూ వార్తలు వస్తునే ఉన్నాయి. బహుబలి తర్వాత పాన్ ఇండియా సినిమాలు చేసిన ప్రభాస్... అనుష్క, కృతి సనన్ తో పెళ్లంటూ వార్తలు వస్తునే ఉన్నాయి. కానీ అవన్నీ పుకార్లే అని తెలుస్తోంది. తాజాగా ప్రభాస్ పెళ్లిపై కృష్ణం రాజు భార్య శ్యామలదేవి.. అంటే ప్రభాస్ పెద్దమ్మ... ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది.
తాజాగా దేవీ నవరాత్రుల సందర్భంగా విజయవాడ దుర్మమ్మని దర్శించుకునేందుకు కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి వచ్చారు. అయితే అక్కడ మీడియా వాళ్లతో మాట్లాడిన శ్యామలదేవి... ప్రభాస్ పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. శ్యామలదేవిని... ప్రభాస్ పెళ్లెప్పుడు? అని మీడియా ప్రతినిధులు అడిగారు. దీనికి బదులిచ్చిన శ్యామలదేవి... కృష్ణంరాజు తమతో లేకపోయినా ఆయన పేరు నిలబెడుతూ మా ఫ్యామిలీ ముందుకెళ్తోంది. ప్రభాస్ పెళ్లి త్వరలోనే కచ్చితంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.

అమ్మాయి ఎవరు? అని అడగ్గా... ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ... డేట్ చెప్పను గానీ త్వరలోనే శుభకార్యం ఉంటుంది. వచ్చే దసరా నాటికి ప్రభాస్ ఓ ఇంటివాడు అవుతాడని చెప్పుకువచ్చింది. ఇప్పుడు ఈమె మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీలో ఉన్నారు. అయితే ప్రభాస్, అనుష్క పెళ్లంటూ గత కొంతకాలంగా ప్రచారం జరగుతూనే ఉంది.
అంతే కాదు.. ప్రభాస్ ఇంటికి అనుష్క ఫాదర్ వెళ్లారని... పెళ్లి గురించే అంటూ కామెంట్స్ వినిపించాయి. మరోవైపు... ప్రభాస్ ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి... వాళ్లు దగ్గరి బంధువు అనే మాట వినిపిస్తుంది. మరి వచ్చే ఏడాదికల్లా ప్రభాస్ పెళ్లి జరుగుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం ప్రభాస్ సలార్, కల్కి సినిమాలతో పాటు... మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా వర్కింగ్ టైటిల్ రాజా డిలాక్స్. ఇక ఈ సినిమాల తర్వాత ప్రభాస్... సందీప్ వంగాతో స్పిరిట్ సినిమా చేయనున్నాడు.


Click it and Unblock the Notifications











