కృష్ణంరాజు భార్యను బాధ పెట్టిన వేణుస్వామి.. లైవ్‌లో అలా చెప్పాడంటూ శ్యామలాదేవి ఎమోషనల్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈశ్వర్ సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిన ఈయన.. ఛత్రపతి, బాహుబలి, సలార్ వంటి పెద్ద పెద్ద చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 43 ఏళ్ల వయసు కల్గిన ఈయన ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడంతో.. చాలా మంది ఈయన జాతకం గురించి చెప్పారు. ముక్యంగా వేణుస్వామి అయితే సంచలన కామెంట్లు చేశారు. అయితే ప్రభాస్ తల్లికి మాత్రమే తెలిసిన ఆయన జాతకం వేణుస్వామి చేతుల్లోకి ఎలా వెళ్లిందో కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి తెలిపారు. ఆ విశేషాలు ఏంటే చూసేయండి.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు జన్మలో పెళ్లి కాదని.. ఆయన అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారని వేణుస్వామి గతకొంత కాలంగా కామెంట్లు చేస్తూనే వస్తున్నారు. ముఖ్యంగా అనుష్క శెట్టి, ప్రభాస్ లు పెళ్లి చేసుకుంటే విడాకులు కూడా తీసుకుంటారని.. అయినా ప్రభాస్ కు పెళ్లి చేసుకునే ఆలోచనే లేదంటూ కూడా ఆయన వివరించారు. అయితే తాజాగా ఈ విషయాలన్నింటిపై ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి స్పందించారు.

ప్రభాస్ విషయంలో వస్తున్న వార్తలు చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుందని... ముఖ్యంగా అతడి జాతకం గురించి వేణుస్వామి చాలా కామెంట్లు చేస్తుంటారని చెప్పుకొచ్చారు. ఆయన చెప్పింది విన్నప్పుడల్లా చాలా బాధ పడుతున్నామని.. ఆయనకు క్రేజ్ తెచ్చుకోవడం కోసం మా బాబును బలి చేయడం ఎందుకు అంటూ ప్రశ్నించారు. అలా చేస్తే ఆయనకు ఏం వస్తుందో నాకు తెలియదు కానీ.. మాకు మాత్రం చాలా ఇబ్బందిగా అనిపిస్తుందంటూ ఆమె వివరించారు.
అంతేకాదు ప్రభాస్ తల్లికి మాత్రమే తెలిసిన ఆయన జాతకం అతడి చేతుల్లోకి ఎలా వెళ్లిందని ప్రశ్నించారు. ఇంత క్లోజ్ గా ఉన్నా... బాబు మా చేతుల్లోనే పెరిగినా మాకే అతడి జాతకం గురించి తెలియదని.. మరి బయట వాళ్లకు ఎలా తెలుస్తుందో నాకైతే అర్థం కాదంటూ ఆమె ఘాటుగా స్పందించారు. మాకు, ప్రభాస్ ఫ్యామిలీకి గొడవలు ఉన్నాయంటూ కొన్ని వెబ్ సైట్లు వార్తలు రాస్తాయని.. అలాంటి చిన్న చిన్న వాటిని తామేమీ పట్టించుకోమని శ్యామలా దేవి చెప్పుకొచ్చారు. కానీ ప్రభాస్ గురించి ఇలా మాట్లాడుతుంటూనే చాలా ఇబ్బందిగా అనిపిస్తుందని వెల్లడించారు.
ప్రభాస్ తనకు పుట్టకపోయినా తన బాబేనని.. తన కూతుళ్లను సొంత చెల్లెల్లకంటే ఎక్కువగా చూసుకుంటాడని కూడా శ్యామలా దేవి వివరించింది. చాలా సంతోషంగా ఉన్న తమపై ఇలా తప్పుడు వార్తలు రాయడం వల్ల.. వారికేమైనా లాభాలు వస్తాయంటే అలాగే చేసుకోనీయండి అంటూ కామెంట్లు చేశారు. ఎవరు ఎలాంటి మాటలు చెప్పినా జరిగేదే జరగుతుందని.. కానీ ఎదుటి వాళ్లను ఇబ్బంది పెట్టకుండా, కాస్త పద్ధతిగా మాట్లాడితే బాగుంటుందంటూ శ్యామలాదేవి వార్నింగ్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











