Marriage: ప్రభాస్, అనుష్క పెళ్లిపై కుండబద్దలు కొట్టిన శ్యామలా దేవి

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో అన్న విషయం కూడా తెల్సింది కానీ, ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు అనేదానికి సమాధానం మాత్రం ఇప్పటివరకు ఎవరికి తెలియడం లేదు. టాలీవుడ్ లోనే ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ప్రభాస్ రికార్డ్ సృష్టించాడు. ప్రభాస్ కన్నా ఏజ్ లో తక్కువ ఉన్న స్టార్స్ అందరూ కూడా పెళ్లిళ్లు చేసుకొని ఫాదర్స్ గా కూడా మారుతున్నారు. కానీ, డార్లింగ్ మాత్రం ఇప్పటివరకు పెళ్లి ఊసు ఎత్తింది లేదు.

డార్లింగ్ డైరెక్ట్ గా పెళ్లి గురించి చెప్పడం లేదని.. అభిమానులు AI లో ప్రభాస్ కు, అనుష్కకు పెళ్లి చేసి.. పిల్లలను కూడా పుట్టించేశారు. అది నిజంకాకపోయినా ఆ ఫోటోలలో ప్రభాస్ - అనుష్క జంట ఎంత అందంగా ఉన్నారో మాటల్లో చెప్పడం కష్టం. బిల్లా సినిమాతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ సినిమా తరువాత ఈ జంట మిర్చి, బాహుబలి 1, బాహుబలి 2 సినిమాల్లో నటించారు. అప్పటినుంచి వీరు ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

krishnamraju s wife syamala devi gave clarity about prabhas and anushka marriage rumours are not true

ప్రభాస్ - అనుష్క.. ప్రేమ, పెళ్లి వార్తలు అభిమానులకు కూడా కొత్తేమికాదు. వీరిద్దరూ ఎప్పటినుంచో ప్రేమలో ఉన్నారని, అప్పట్లో కృష్ణంరాజు వీరి పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో.. వేరేవారిని పెళ్లి చేసుకోకుండా ఇలా ఉండిపోయారని వార్తలు వచ్చాయి. కానీ, తామిద్దరం కేవలం స్నేహితులమే అని, ప్రభాస్ - అనుష్క చెప్పుకొస్తున్నా అభిమానులు మాత్రం వారు జంటగా మారాలని దేవుడును కోరుకుంటున్నారు.

ఇంకోపక్క ప్రభాస్ ఫ్యామిలీ.. ఆయనకు సంబంధాలు చూస్తోందని, సినీ ఇండస్ట్రీకి సంబంధం లేని అమ్మాయిని కోడలిగా తెచ్చుకోవాలని ఉప్పలపాటి కుటుంబం చూస్తుందని కూడా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి స్పందించింది. ప్రభాస్ పెళ్లిపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టం చేసింది.

ప్రభాస్ - అనుష్క పెళ్లి చేసుకోవడం లేదని ఎన్నిసార్లు చెప్పినా మళ్లీ ఆ పుకార్లే వస్తున్నాయని, అందులో నిజం లేదని చెప్పుకొచ్చింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో శ్యామల దేవి మాట్లాడుతూ., " ప్రభాస్- అనుష్క పెళ్లిపై వస్తున్న రూమర్స్ అన్ని ఫేక్.. ప్రభాస్ నచ్చి పెళ్లి చేసుకుంటాను అంటే కాదనేవారుఎవరు .. ? తన పెళ్లి తన ఇష్టం. తన జీవితం ఎవరితో సంతోషంగా ఉంటుంది అనుకుంటాడో వారినే సెలక్ట్ చేసుకుంటాడు. అలా ఎవరిని ప్రభాస్ సెలెక్ట్ చేసుకున్నా మాకేమి అభ్యంతరం లేదు. ప్రభాస్ ది చాలా మంచి మనసు.. ఎంతో స్వచ్ఛమైనది. ఎదుటివాళ్ళ సంతోషంలోనే తన సంతోషాన్ని వెతికే వ్యక్తి ప్రభాస్" అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

krishnamraju s wife syamala devi gave clarity about prabhas and anushka marriage rumours are not true

ఇక ప్రభాస్ ఎవరిని పెళ్లి చేసుకున్నా పర్వాలేదు.. పెళ్లి అయితే చాలు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వయస్సు 44. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలను ఫినిష్ చేసి చేసుకోవాలి అంటే కష్టం. అందుకే సినిమాలను పక్కన పెట్టి అయినా పెళ్లి చేసుకుంటే బావుంటుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి డార్లింగ్.. ఇప్పుడైనా ఫ్యాన్స్ కోరికను నెరవేరుస్తాడో లేదో చూడాలి.

More from Filmibeat

Read more about: syamala devi prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X