Kriti Shetty యువ హీరోతో రెచ్చిపోయి ముద్దులు.. ఫస్ట్‌లుక్‌తో ఉప్పెన భామ జోరు

టాలీవుడ్‌లో హాట్ హీరోయిన్ కృతిశెట్టి వరుస విజయాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ ముందుకు వెళ్తున్నది. ఆమె నటించిన ఉప్పెన, శ్యామ్ సింగరాయ్ చిత్రాలు ఘనవిజయాన్ని సొంతం చేసుకొన్నది. రెండు విజయాలు ఖాతాలో వేసుకొన్న తర్వాత భారీ ఆఫర్లతో కృతిశెట్టి ముందుకెళ్తున్నది. తాజాగా ఆమె యువ హీరో సుధీర్ బాబు, దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటితో జతకట్టింది. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో వస్తున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా ఫస్ట్ లుక్‌ను నూతన సంవత్సర కానుకగా ప్రేక్షకులకు అందించారు.

Krithi Shetty Kiss with Sudheer Babu

మైత్రీ మూవీస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ హాట్‌ హాట్‌గా కనిపించంది. సుధీర్ బాబు, కృతిశెట్టి ఇద్దరు మంచి రొమాంటిక్ మూడ్‌లో ఆకట్టుకొన్నారు. కృతి మెడపై సుధీర్ ముద్దు పెడుతుండగా.. ఆమె కళ్లు మూసుకొని తన్మయత్నంలో మునిగిపోయింది. దీంతో ఈ సినిమాలో వారి మధ్య ఏ రేంజ్‌లో కెమిస్ట్రీ ఉండబోతుందో చెప్పకనే చెప్పారు. ఈ సినిమాలో రొమాంటిక్ యాంగిల్‌ను ప్రేక్షకులకు తెలియజెప్పారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీకి వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. పీజీ విందా సినిమాటోగ్రఫిని అందిస్తున్నారు. ఎడిటర్‌గా మార్తాండ్ కే వెంకటేష్ వ్యవహరిస్తున్నారు.

లవ్ అండ్ రొమాంటిక్ చిత్రంగా రూపొందుతున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రంలో అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కల్యాణి నటరాజన్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకోనున్నది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటించేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

నటీనటులు: సుధీర్ బాబు, కృతిశెట్టి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు
రచయిత, డైరెక్టర్: మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి
నిర్మాతలు: బీ మహేంద్ర బాబు, కిరాణ్ బల్లపల్లి
సమర్పణ: సుధీర్ బాబు గాజులపల్లే
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్ మార్క్ స్టూడియోస్
మ్యూజిక్: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫి: పీజీ విందా
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X