మెగాస్టార్ మేనల్లుడి హీరోయిన్ ఈమెనే.. ఉప్పెనతో సినీ ఎంట్రీ
మెగాస్టార్ మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ సినిమా రంగ ప్రవేశం అట్టహాసంగా జరిగింది. ఈ సినిమాకు ఉప్పెన అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో తమిళ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్రను పోషిస్తున్నారనే వార్త సినిమాపై అంచనాలు పెంచింది. తాజాగా వైష్ణవ్ తేజ్ సరసన నటించే హీరోయిన్ పేరును మీడియాకు వెల్లడించారు.
బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించే ఉప్పెన చిత్రంలో కీర్తి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. ఆమె మంగళూరుకు చెందిన అమ్మాయి. కీర్తికి ఇదే తొలి చిత్రం. ఈ చిత్రం ద్వారానే సినిమా రంగానికి పరిచయం అవుతున్నారు అని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ వెల్లడించింది. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్‌తో కలిసి నిర్మిస్తున్నది. గతంలో బుచ్చిబాబు సానా దర్శకుడు సుకుమార్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేశారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. షామ్దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.

నటీనటులు: వైష్ణవి తేజ్, విజయ్ సేతుపతి, కృతిశెట్టి
రచన, దర్శకత్వం: బుచ్చిబాబు సానా
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, మోహన్ (సీవీఎం)
సీఈవో: చెర్రీ
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రాఫర్: షామ్దత్ సైనుద్దీన్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్ డైరెక్టర్: మౌనికా రామకృష్ణ


Click it and Unblock the Notifications











