twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సోషల్ మీడియా ఫేక్, విషపూరితం.. ట్వీట్ చేస్తేనే స్పందించినట్టా..ట్రోల్స్‌పై కృతిసనన్ ఫైర్

    |

    బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా డిప్రెషన్‌కు లోనైన సుశాంత్ గత ఆదివారం తన నివాసంలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుశాంత్ మరణం సినీ ఇండస్ట్రీనే కాదు యావత్ భారతావనినే కుదిపేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్న హీరో ఇలా అర్దాంతరంగా జీవితాన్ని ముగించడంపై బాలీవుడ్ ఆధిపత్య ధోరణే కారణమని నెటిజన్స్ ఫైర్ అయ్యారు. అయితే సుశాంత్ మృతిపై తారా లోకం సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని వ్యక్తం చేసింది.

    అంత్య క్రియలకు బాలీవుడ్ గైర్హాజరు..

    అంత్య క్రియలకు బాలీవుడ్ గైర్హాజరు..

    సోషల్ మీడియాలో మొసలి కన్నీళ్లు కార్చిన వారంతా సుశాంత్ అంత్యక్రియలకు హాజరు కాలేదు. సల్మాన్, అక్షయ్, షారుఖ్, అమితాబ్, కరణ్ జోహర్ ఇలా ఎంతో మంది ప్రముఖులు సుశాంత్ మరణంపై ట్వీట్ వేసి చేతులు దులుపుకున్నారు. అయితే మాజీ ప్రేమికులైన కృతి సనన్, రియా చక్రవర్తి వంటి వారు మాత్రం సోషల్ మీడియాలో స్పందించలేదు.

    అంత్యక్రియలకు హాజరైంది వారే..

    అంత్యక్రియలకు హాజరైంది వారే..

    సోషల్ మీడియాలో కృతి సనన్, రియా చక్రవర్తి సోషల్ మీడియాలో స్పందించలేదు. అయితే ఈ మేరకు నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సుశాంత్ మరణంపై స్పందించడం లేదంటూ ఫైర్ అయ్యారు. విపరీతంగా ట్రోల్ చేశారు. కానీ మరునాడు అంత్యక్రియలకు హాజరైంది మాత్రం వీరే. వివేక్ ఒబేరాయ్, శ్రద్దా కపూర్ ఇలా ఓ ఐదాగురే చివరి యాత్రలో పాల్గొన్నారు.

    ట్రోల్స్‌పై కృతి సనన్ ఫైర్..

    ట్రోల్స్‌పై కృతి సనన్ ఫైర్..

    సుశాంత్ మృతిపై సోషల్ మీడియాలో స్పందించనందుక తనను ట్రోల్ చేయడంపై కృతి సనన్ ఫైర్ అయింది. ఈ మేరకు పోస్ట్ చేస్తూ.. ఈ క్షణం నా మదిలో ఎన్నో మెదులుతున్నాయి కానీ ఇది మాత్రం చెప్పాలనుకుంటున్నానని సుదీర్ఘంగా రాసుకొచ్చింది.

    విష పూరితం..

    విష పూరితం..

    అప్పటి వరకు ట్రోల్స్, గాసిప్ చేసుకుంటూ వచ్చిన ఈ ప్రపంచం మనం వెళ్లిపోయాక ఒక్కసారిగా మనలోని మంచి తనాన్ని, పాజిటివ్‌ను చూస్తుంది.. అదే నాకు వింతగా అనిపిస్తోంది. సోషల్ మీడియా అనేది ఫేక్, అత్యంత విష పూరితమైన స్థలం.

    Recommended Video

    Sushant Singh Rajput : Kriti Sanon Heart Breaking Tribute To Sushant | సుష్.. నీ శత్రువు అదే
    సోషల్ మీడియానే వాస్తవిక ప్రపంచం..

    సోషల్ మీడియానే వాస్తవిక ప్రపంచం..

    మనం ఒకవేళ రిప్ అని పోస్ట్ చేయకపోయినా స్పందించకపోయినా నీవు సంతాపాన్ని వ్యక్తం చేయనట్టు, బాధపడనట్టు, దిగ్భ్రాంతిని వ్యక్తం చేయనట్టు. అయితే వాస్తవంగా అలా చేసిన వారు నిజంగానే బాధపడ్డారా? అయితే ప్రస్తుతం సోషల్ మీడియా అనేది వాస్తవిక ప్రపంచం అయినట్టు కనిపిస్తోంది. వాస్తవ ప్రపంచం అవాస్తవంగా మారింది.

    English summary
    Kriti sanon Fires on Social Media Trolling Her. she says that There are a lot of thoughts crossing my mind.. A LOT!But for now this is all i wanna say!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X