మోత మోగిస్తున్న మహేష్ బాబు హీరోయిన్.. 2 కోట్ల మందితో!
తెలుగులో అదృష్టం కలిసి రాక బాలీవుడ్‌కు చెక్కేసిన అందాల భామ కృతిసనన్ సోషల్ మీడియాలో మోత మోగిస్తున్నది. ఇటీవల లుకా చుప్పీ సినిమాతో సక్సెస్ చేజిక్కించుకొన్న కృతి ఇన్స్‌టాగ్రామ్‌లో 20 మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించుకొన్నది. అంటే దాదాపు రెండు కోట్ల మంది అభిమానులు తనను ఫాలో కావడం విశేషంగా మారింది. ఈ అరుదైన ఘనతను సొంత చేసుకొన్న నేపథ్యంలో ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ వీడియో పెట్టి అభిమానులకు థ్యాంక్స్ చెప్పింది.
2015 జనవరి 15 నుంచి కృతిసనన్ ఇన్స్‌టాగ్రామ్‌ను ఉపయోగిస్తున్నది. బాలీవుడ్ హీరోయిన్లలో అతివేగంగా ఎక్కువ ఫాలోవర్స్‌ను సొంతం చేసుకొన్న తారగా క్రెడిట్ కొట్టేసింది. ఐదు సంవత్సరాల్లో 20 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు అని కృతి పేర్కొన్నది.

ఇటీవల కృతి నటించిన లుకా చుప్పీ సినిమా ఆమె కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. గతంలో 1: నేనొక్కడినే సినిమాలో సూపర్‌స్టార్ మహేష్ బాబు సరసన నటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











