ఓటీటీలో ప్రభాస్ హీరోయిన్ మూవీ.. గర్భవతిగా ప్రేక్షకుల ముందుకు..
బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. లాక్‌డౌన్ తర్వాత భారీ ఆఫర్లను దక్కించుకొంటూ దూసుకెళ్తున్నారు. ఇటీవల అదిపురుష్ సినిమాలో ప్రభాస్‌తో నటించే అవకాశం దక్కించుకొన్న ఈ అందాల భామ గ్లామర్ పాత్రలతోపాటు డీ గ్లామర్ రోల్స్‌ను కూడా చేస్తూ నటిగా ప్రూవ్ చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె నటించిన మిమి చిత్రం ఓటీటీలో రిలీజ్‌కు సిద్దమవుతున్నది.
తడిసిన అందాలతో కవ్విస్తోన్న ప్రియాంక చోప్రా
కరోనావైరస్ పరిస్థితులు దారుణంగా ఉన్న సమయంలో మిమి సినిమాను థియేటర్లో రిలీజ్ చేసే అంశంపై పునరాలోచనలో పడ్డారు. ఇప్పట్లో పరిస్థితులు చక్కదిద్దుకొనే పరిస్థితులు లేకపోవడం వల్ల ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో రిలీజ్ చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారని కృతిసనన్ పేర్కొన్నారు.

మీమి మూవీని నిర్మాత దినేష్ విజన్ థియేటర్లో రిలీజ్ చేయాలని భావించారు. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల వల్ల దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలనుకొంటున్నారు అని కృతి సనన్ తెలిపారు.
మీమీ సినిమాలో కృతిసనన్ పాత్ర విషయానికి వస్తే.. అద్దె గర్భంతో పిల్లలకు జన్మనిచ్చే మహిళగా ఓ విభిన్నమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, సుప్రియా పాథక్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











