Devara: ఎన్టీఆర్ మూవీలో ప్రభాస్ హీరోయిన్.. అబ్బా థియేటర్లు ఊగిపోవడం ఖాయం
బడా సినీ బ్యాగ్రౌండ్‌తోనే హీరోగా పరిచయం అయినా.. ఎంతో కష్టపడి స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. చిన్న వయసులోనే ఇండస్ట్రీ హిట్లు కొట్టినా మధ్యలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. మళ్లీ ఈ మధ్యనే ఫామ్‌లోకి వచ్చి వరుస హిట్లతో సత్తా చాటుతోన్నాడు. పైగా ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గానూ ఎదిగిపోయి మరింత ఉత్సాహంతో వెళ్తున్నాడు.
యమ జోష్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు 'దేవర' అనే మూవీ చేస్తున్నాడు. బిగ్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతుంది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో తీస్తుండడంతో ఈ మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తీస్తున్నారు. ఫలితంగా ఈ చిత్రంపై ఆసక్తి రెట్టింపు అవుతోంది.

కొరటాల శివ - ఎన్టీఆర్ కలిసి చేస్తున్న 'దేవర' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను గత మార్చిలోనే స్టార్ట్ చేశారు. ఆ వెంటనే దీనికి సంబంధించిన పలు భారీ యాక్షన్ షెడ్యూళ్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎన్టీఆర్‌పై మిడ్ ఓషన్ యాక్షన్ సీక్వెన్స్‌ను తీస్తున్నారు. దీని తర్వాత జాన్వీ కపూర్‌పైనా కీలకమైన సన్నివేశాలు తీయనున్నారు.
కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌లో రూపొందుతోన్న 'దేవర' మూవీలో పలు ఇండస్ట్రీలకు చెందిన ఎంతో మంది నటీనటులు కూడా భాగం అయ్యారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమా కోసం 'ఆదిపురుష్' హీరోయిన్ కృతి సనన్‌ను కూడా తీసుకున్నారని తెలిసింది. అయితే, ఈమెకు ఇందులో ఎలాంటి పాత్ర లేకున్నా.. ఓ స్పెషల్ సాంగ్‌లో మాత్రం మెరవబోతుందనే టాక్ జోరుగా వినిపిస్తోంది.

'దేవర' మూవీలో ఓ క్రేజీ స్పెషల్ సాంగ్‌ను పెడుతున్నారట. దీనికోసం ఎంతో మంది హీరోయిన్లను అనుకున్నా.. చివరకు కృతి సనన్‌ను ఫిక్స్ చేసుకున్నారని తెలిసింది. ఇక, ఈ పాట కోసం అనిరుథ్ అదిరిపోయే ట్యూన్ రెడీ చేస్తున్నాడని అంటున్నారు. 'జైలర్' కావాలయ్యా పాట మాదిరిగా దీనికోసం స్పెషల్ బీట్‌తో రాబోతున్నాడట. దీంతో ఈ పాటపై అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక, 'దేవర' మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీని 2024 ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











