‘ఆదిపురుష్’లో సీతగా మహేశ్ బాబు హీరోయిన్.. ప్రభాస్‌కు పర్‌ఫెక్ట్ మ్యాచ్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న చిత్రం 'ఆదిపురుష్'. టీ సిరీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చెడు మీద మంచి గెలవడం అనే కాన్సెప్ట్‌తో రూపొందే ఈ సినిమాను హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. అలాగే, ఈ మూవీలో రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

ఇక, ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయంలో ఎప్పటి నుంచో ఊహాగానాలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇందులో సీతగా నటించే హీరోయిన్ పలానా నటి అంటూ రోజుకో పేరు బయటకు వస్తోంది. ఈ నేపథ్యంలోనే ముందు 'మహానటి' కీర్తి సురేష్ పేరు వినిపించింది. ఆ తర్వాత బాలీవుడ్ బ్యూటీలు ప్రియాంక చోప్రా, కియారా అద్వాణీ, అనన్య పాండే ఇలా చాలా మందిని అనుకున్నారు. కానీ, తాజా సమాచారం ప్రకారం.. 'ఆదిపురుష్'లో సీతగా కృతీ సనన్ నటిస్తుందని ఓ న్యూస్ బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీల్లో చక్కర్లు కొడుతోంది.

Kriti Sanon to play Sita role in Prabhass Adipurush Movie

గతంలో మహేశ్ బాబు నటించిన '1 నేనొక్కడినే' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది కృతీ సనన్. ఆ తర్వాత అక్కినేని నాగ చైతన్యతో కలిసి 'దోచెయ్' అనే మూవీ చేసింది. ఈ రెండు చిత్రాలూ ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో బాలీవుడ్‌లో స్థిరపడిపోయింది. ఈ క్రమంలోనే హిందీలో 'దిల్‌వాలే', 'రబ్తా', 'హౌస్‌ఫుల్ 4', 'పానిపట్', 'పతీ పత్నీ ఔర్ వో' అనే సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం 'మిమీ', 'బచ్చన్ పాండే' వంటి సినిమాల్లో నటిస్తోంది. వీటి తర్వాత 'ఆదిపురుష్'లో నటిస్తుందని బీ టౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X