సుశాంత్ బయోపిక్ తీస్తా.. కేఆర్కేకు షాకిచ్చిన యువ హీరో ఫ్యాన్స్
సుశాంత్ సింగ్ మరణంపై సంతాపాలు, శ్రద్దాంజలి ఘటిస్తూ ఓ వైపు.. మరో వైపు వివాదాలతో పోలీసుల దర్యాప్తు వేగంగా కొనసాగుతుండగానే యువ హీరో జీవితంపై బయోపిక్ తీయడానికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. తాజాగా వివాదాస్పద క్రిటిక్, నిర్మాత, నటుడు కమల్ ఆర్ ఖాన్ అలియాస్ కేఆర్కే తాను సుశాంత్ బయోపిక్‌ను తీస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించారు.
కేఆర్కే ట్వీట్ చేస్తూ.. సుశాంత్ మరణానికి కారణమైన దుర్మార్గుల జీవితాలను బయటపెట్టేందుకు సుశాంత్ సింగ్‌పై బయోపిక్ నిర్మిస్తానని ప్రామిస్ చేస్తున్నాను. బాలీవుడ్ ప్రముఖులను ద్వేషించడానికి నేను చాలా ఇష్టపడుతాను అంటూ కేఆర్కే తన ట్వీట్‌లో తెలిపారు.

కేఆర్కే ట్వీట్ చేయగానే.. సుశాంత్ అభిమానులు ప్రతికూలంగా స్పందించారు. #FakeKRKRealCulpritOfSushant అంటూ ఓ హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. కేఆర్కే హిప్పోక్రాటిక్.. గతంలో సుశాంత్‌పై అవాకులు చేవాకులు పేలాడనే విషయాన్ని గుర్తు చేశారు. సుశాంత్ నటించిన డ్రైవ్, రా, సంచిదియా, కేదారినాథ్, చందమామ దూర్ కే సినిమాలు చెత్తగా ఉన్నాయంటూ రివ్యూలు రాశారు. సుశాంత్‌ను బ్యాన్ చేయాలంటూ నినాదం చేసిన వారిలో కేఆర్కే కూడా ఉన్నారు అనే విషయాన్ని గుర్తు చేశారు.
ఒకవేళ ఇమ్రాన్ హష్మీ, సుశాంత్ సింగ్, రాజ్ కుమార్ రావు, ఆయుష్మాన్ , శర్మాన్ స్టార్లు అయితే.. హర్మన్ భవేజా ఈ మిలియంకు బిగ్గెస్ట్ స్టార్ అని ట్వీట్ చేసిన విషయాన్ని ఎండగట్టారు.


Click it and Unblock the Notifications











