twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్‌ కంటెంట్‌తో కెఎస్100.. అయినా సింగిల్ కట్ లేకుండా..!

    |

    మోడలింగ్ స్టార్స్ సమీర్ ఖాన్, శైలజ హీరో హీరోయిన్ లుగా చంద్రశేఖరా మూవీస్ పతాకంపై వెంకట్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం "కెఎస్100".. షేర్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్షిత, అషి, పూర్వి సునీత, శ్రద్దా, నందిని, కల్పన అజీమ్, సుమన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి నవనీత్ చారి సంగీతం సమకూరుస్తుండగా, భాష్య శ్రీ సాహిత్యం అందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన రాగ, తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని 'ఎ' సర్టిఫికెట్ ని పొందింది.

    ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వెంకట్ రెడ్డి మాట్లాడుతూ " "కెఎస్100" చిత్రం అన్ని పనులు పూర్తిచేసుకుంది. ఈ నెల 21 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. నేడు సెన్సార్ పూర్తి చేసుకుని సింగిల్ కట్ లేకుండా "ఏ" సర్టిఫికెట్ ని పొందింది. సినిమాలో హారర్ సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో ఈ సర్టిఫికెట్ ఇచ్చారు.. సినిమా చాల బాగా వచ్చింది. సినిమాలోని అంశాలను ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది అన్నారు.

    KS 100 movie gets A certificate

    చిత్ర చిత్ర దర్శకుడు మాట్లాడుతూ " కెఎస్100" చిత్రం అవుట్ ఫుట్ చాల బాగా వచ్చింది.. సెన్సార్ కూడా పూర్తి చేస్కుని ఒక్క కట్ లేకుండా "ఏ" సర్టిఫికెట్ పొందడం ఆనందంగా ఉంది.. ఈ నెల 21న సినిమా ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.. ఈ సినిమా ఇంతబాగా రావడానికి సహకరించిన అందరికి ధన్యవాదాలు" అన్నారు.

    నటీనటులు : అక్షిత, అషి,పూర్వి, సునీత, శ్రద్దా, నందిని, కల్పన అజీమ్, సుమన్ తదితరులు
    సాంకేతిక నిపుణులు :
    మాటలు- కధ- కథనం-దర్శకత్వం: షేర్
    నిర్మాత : వెంకట్ రెడ్డి
    కెమెరా: వంశీ
    మ్యూజిక్: నవనీత్ చారి
    ఎడిటర్: లొకెష్ చందు, నాగార్జున
    సాహిత్యం: భాష్య శ్రీ,
    కొరియోగ్రఫీ: జొజొ
    యాక్షన్: మాలేష్
    నేపథ్యసంగీతం :రామ్ మోహన్ చారి
    అసొషియెట్ డైరెక్టర్: రవితేజ
    ఆర్ట్: సుదర్శన్

    English summary
    KS 100 another hot romantic movie in Tollywood. It is getting ready for release. This movie got A certificate without single cut.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X