హాట్‌హాట్‌గా KS100.. ఆ ఫీలింగ్ తగ్గించేలా..

మోడలింగ్ స్టార్స్ సమీర్ ఖాన్, శైలజ హీరో హీరోయిన్ లుగా షేర్ దర్శకత్వం లో రాబోతున్న చిత్రం "కెఎస్100".. చంద్రశేఖరా మూవీస్ పతాకంపై వెంకట్ రెడ్డి ఈ సినిమా ను నిర్మిస్తున్నారు.. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది. ఈ చిత్రానికి నవనీత్ చారి సంగీతం సమకూరుస్తుండగా, భాష్య శ్రీ సాహిత్యం అందించారు.. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకుని 'ఎ' సర్టిఫికెట్ దక్కించుకోగా జులై 5 న సినిమా ని రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.

ఈ సందర్భంగా చిత్ర హీరో సమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ సినిమా జులై 5 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.. చాలామంది ఈ సినిమా కోసం ఎదురుచూశారు..నా సోషల్ మీడియా లో ఎప్పుడు రిలీజ్ అని అడిగారు.. సినిమాకోసం వెయిట్ అందరికి చాల థాంక్స్.. తప్పకుండా అందరు ఈ సినిమా ను ఆదరించండి.. అన్నారు..

KS 100 movie set to release on July 5th

చిత్ర దర్శకుడు మాట్లాడుతూ " కెఎస్100" చిత్రం జులై 5 న రాబోతుంది.. చిత్రం రిలీజ్ లేట్ అయినా ఈ సినిమా ద్వారా ఒక మంచి మెసేజ్ ఇవ్వబోతున్నా.. ప్యూర్ ఫ్యామిలీ సినిమా.. ప్రతి సీన్ లో ఒక మెసేజ్ ఉంది.. ప్రతి ఒక్కరు మనమే గొప్ప అనే ఫీలింగ్ ని తగ్గిస్తుంది.. తప్పకుండా ఈ సినిమా అందరిని మెప్పిస్తుంది.. సాంగ్స్, ట్రైలర్ ద్వారా మంచి క్రేజ్ ఉంది.. ఆ క్రేజ్ ని ఈ సినిమా మరింత పెంచుతుంది.. అన్నారు..

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వెంకట్ రెడ్డి మాట్లాడుతూ "కెఎస్100" చిత్రం అన్ని పనులు పూర్తిచేసుకుని జులై 5
న దాదాపు 500 థియేటర్స్‌లో రిలీజ్ కాబోతుంది.. ఒక మంచి సినిమా తీస్తే ఎలాంటి అవుట్ ఫుట్ ఉంటుందో అలాంటి సినిమా చేసాం.. డైరెక్టర్ షేర్ మంచి సినిమా చేశారు.. మంచి మెసేజ్ ఉంది.. మేకింగ్ కి ఎంత కష్టపడ్డాడో సినిమా రిలీజ్ కి అంతే కష్టపడ్డాడు.. తప్పకుండ ఈ సినిమా అందరికి నచ్చుతుంది అన్నారు.

నటీనటులు : అక్షిత, అషి,పూర్వి, సునీత, శ్రద్దా, నందిని, కల్పన అజీమ్, సుమన్ తదితరులు

KS 100 movie set to release on July 5th

సాంకేతిక నిపుణులు :
మాటలు- కథ- కధనం -దర్శకత్వం: షేర్
నిర్మాత : వెంకట్ రెడ్డి
కెమెరా: వంశీ
మ్యూజిక్: నవనీత్ చారి
ఎడిటర్: లొకెష్ చందు, నాగార్జున
సాహిత్యం: భాష్య శ్రీ,
కొరియోగ్రఫీ: జొజొ
యాక్షన్: మాలేష్
నేపథ్యసంగీతం :రామ్ మోహన్ చారి
అసొషియెట్ డైరెక్టర్: రవితేజ
ఆర్ట్: సుదర్శన్
పి.ఆర్.ఓ : సాయి సతీష్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X