కేఎస్100 సక్సెస్ జోష్.. హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీకి యూత్ ఫిదా!
Recommended Video
మోడలింగ్ స్టార్స్ సమీర్ ఖాన్, శైలజ హీరో హీరోయిన్ లుగా షేర్ దర్శకత్వం లో జులై 12 న విడుదలై విజయం సాధించిన చిత్రం "కెఎస్100". చంద్రశేఖరా మూవీస్ పతాకంపై వెంకట్ రెడ్డి ఈ సినిమా ను నిర్మించారు.. ఈ చిత్రానికి నవనీత్ చారి సంగీతాన్ని, భాష్య శ్రీ సాహిత్యాన్ని అందించారు.. చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా చిత్ర హీరో సమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ సినిమా జులై 12 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశాం. యూత్ ఎక్కువగా మా సినిమాను ఇష్టపడుతున్నారు. నటుడిగా నాకు ఈ చిత్రం గుడ్ బిగినింగ్ అన్నారు. నన్ను, నా సినిమాను ఆదరించినందుకు ధన్యవాదాలు అని అన్నారు.

చిత్ర దర్శకుడు షేర్ మాట్లాడుతూ " కేఎస్100" సినిమా వెనుక మా కష్టం చాలా ఉంది. విడుదలై మా కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది. చిన్నగా విడుదలై సైలెంట్ హిట్ అయింది. మా టీమ్ అందరు మంచి పొజిషన్స్ కు వెళ్లాలన్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వెంకట్ రెడ్డి మాట్లాడుతూ "కేఎస్100" చిత్రం జులై 12న దాదాపు 200 థియేటర్స్‌లో రిలీజ్ అయి యూత్ ను ఆకట్టుకుంటొంది. ఒక మంచి ట్రెండీ సినిమా తీస్తే ఎలా ఉంటుందొ మా సినిమా నే ఉదాహారణ. డైరెక్టర్ షేర్ మంచి ఎంటర్ టైన్మెంట్ తోపాటు మెసేజ్ మా సినిమా ద్వారా ఇచ్చారన్నారు. నవనీత్ మాట్లాడుతూ.. సంగీత దర్శకుడిగా నా వర్క్ కమంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ ఫారూఖ్ మాట్లాడుతూ.. ఐదు సినిమాల మధ్య విడుదలై ఈ సినిమా ఇంకా అద్భుతంగా ఆడుతోందన్నారు.
నటీనటులు : అక్షిత, అషి,పూర్వి, సునీత, శ్రద్దా, నందిని, కల్పన అజీమ్, సుమన్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
మాటలు, కథ, కథనం, దర్శకత్వం: షేర్
నిర్మాత: వెంకట్ రెడ్డి
కెమెరా: వంశీ
మ్యూజిక్: నవనీత్ చారి
ఎడిటర్: లొకెష్ చందు, నాగార్జున
సాహిత్యం: భాష్య శ్రీ,
కొరియోగ్రఫీ: జొజొ
యాక్షన్: మాలేష్
నేపథ్య సంగీతం: రామ్ మోహన్ చారి
అసొషియెట్ డైరెక్టర్: రవితేజ
ఆర్ట్: సుదర్శన్.


Click it and Unblock the Notifications











