కౌసల్య కృష్ణమూర్తి‌కు మంచి రెస్సాన్స్.. మాతృదేవోభవ తర్వాత అంతటి.. కెఎస్‌ రామారావు

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మించిన చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్‌. ప్రముఖ తమిళ్‌ హీరో శివ కార్తికేయన్‌ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ విభిన్నకథా చిత్రం ఆగష్టు 23 ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్‌హిట్‌ టాక్‌తో మంచి కలెక్షన్స్‌ సాధిస్తూ.. సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ సందర్భంగా ఆగస్ట్‌ 24న హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో చిత్ర యూనిట్‌ సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో...

క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కేఎస్‌ రామారావు మాట్లాడుతూ - ''మా బ్యానర్‌లో తెరకెక్కిన 'కౌసల్య కృష్ణమూర్తి' ఆగష్టు 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మా చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఓవర్సీస్‌లోనూ ఇటు ప్రేక్షకులతో పాటు సమీక్షకుల ప్రశంసలు లభించాయి. దానికి కారణమైన దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు, హీరోయిన్‌ ఐశ్వర్య రాజేష్‌, రాజేంద్ర ప్రసాద్‌, కార్తీక్‌రాజులను అభినందిస్తున్నాను. సినిమాకు మంచి ప్రశంసలు లభించినా కమర్షియల్‌గా ఇంకా మంచి సక్సెస్‌ సాధించడం ఎంతో అవసరం. చిన్న బడ్జెట్‌ సినిమాలకు, సమాజానికి ఉపయోగపడే ఒక పర్పస్‌ఫుల్‌ మూవీస్‌కి మీ అందరి ప్రోత్సాహం కావాలి. అప్పుడే ఇండస్ట్రీలో మంచి సినిమాలు రావడానికి స్కోప్‌ ఉంటుంది.

KS Rama Rao: Kousalya Krishnamurthy gets good response

కౌసల్య కృష్ణమూర్తి సినిమా చూసినవారు ఒకప్పుడు 'శంకరాభరణం', 'మాతృదేవోభవ' లాంటి మరో గొప్ప సినిమా 'కౌసల్య కృష్ణమూర్తి' అంటున్నారు. మీ అందరి సద్విమర్శలు మా సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాయి. ఈ మధ్యకాలంలో అన్ని వెబ్‌ సైట్స్‌ ఇంత గొప్పగా రాసిన సినిమా, అన్ని వెబ్‌ సైట్స్‌లోనూ 3.5 నుండి 4 వరకూ రేటింగ్స్‌ రావడం విశేషం. ఒక మంచి సినిమాను మీడియా ఎంత బాగా ప్రోత్సహిస్తుంది అనడానికి ఈ రివ్యూలు నిదర్శనం. మా టీమ్‌ అందరం గర్వంగా చెప్పుకునే 'కౌసల్య కృష్ణమూర్తి' గొప్ప విజయం సాధించడానికి మీ అందరి సహకారం తప్పకుండా ఉంటుందని నమ్ముతున్నాను. ఇక నుండి క్రియేటివ్‌ కమర్షియల్స్‌ నుండి కచ్చితమైన, మంచి పర్పస్‌ ఉన్న మూవీస్‌ వస్తాయని, మా రాబోయే సినిమాల్లో కూడా అదే క్వాలిటీ, అదే నిజాయితీని మీరు చూస్తారని నమ్ముతున్నాను. అలాగే క్రియేటివ్‌ కమర్షియల్స్‌లో భాగం అయిన బి.ఎ.రాజుగారికి, సి జోన్‌ విశ్వకి థాంక్స్‌ అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X